తెలంగాణ

telangana

ETV Bharat / bharat

లగేజ్​ వ్యాన్​పై ట్యాంకర్ బోల్తా.. 8 మంది మృతి.. మరో ఏడుగురి పరిస్థితి విషమం - హరియాణా రోడ్డు ప్రమాదం

Uttar Pradesh Accident Today : ఉత్తర్​ప్రదేశ్​లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. లగేజ్​ వ్యాన్​పై.. ఓ ట్యాంకర్ బోల్తా కొట్టడం వల్ల జరిగిందీ దుర్ఘటన.

Uttar Pradesh Accident Today
Uttar Pradesh Accident Today

By

Published : Jul 10, 2023, 5:27 PM IST

Updated : Jul 10, 2023, 6:15 PM IST

Uttar Pradesh Accident Today : ఓ ట్యాంకర్.. లగేజ్​ వ్యాన్​పై బోల్తా కొట్టిన ఘటనలో ఎనిమిది మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘోర ప్రమాదంఉత్తర్​ప్రదేశ్​లోని ప్రతాప్​గఢ్​లో సోమవారం జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ప్రతాప్​గఢ్​ మెడికల్ కాలేజీకి తరలించారు.

15 మంది ప్రయాణికులతో ఓ లగేజీ వ్యాన్​ ప్రతాప్​గఢ్​ వైపు వెళ్తోంది. అదే సమయంలో ఓ ట్యాంకర్​ మోహన్​గంజ్​ నుంచి వస్తోంది. ఇంతలో ఆ ట్యాంకర్ అదుపుతప్పి లగేజీ వ్యాన్​పై బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో లగేజీ వ్యాన్​లో ఉన్న 8 మంది మరణించగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ పోలీసులు.. ప్రతాప్​గఢ్ మెడికల్ కాలేజీకి తరలించారు.

యోగి పరిహారం..
మరోవైపు.. ప్రతాప్​గఢ్ రోడ్డు ప్రమాదంపై ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. రోడ్డు ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల యోగి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు.. రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు ఎక్స్​గ్రేషియా ప్రకటించారు.

లోయలో పడిపోయిన వాహనం..
మరోవైపు.. హిమాచల్​ప్రదేశ్​లో ఓ వాహనం లోయలో పడిన ఘటనలో నలుగురు మృతి చెందగా.. మరొకరు గాయపడ్డారు. కులూ జిల్లాలోని రాంపుర్-కేదాస్ లింక్ రోడ్డుపై సోమవారం జరిగిందీ ప్రమాదం. మృతులను హర్ద్యాల్ (65), రంజన (47), వర్ష, నారాయణ శర్మగా పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Haryana Road Accident : రెండు రోజుల క్రితం హరియాణాలో ఆర్టీసీ బస్సు - వ్యాన్​ ఢీకొన్న ఘటనలో ఎనిమిది మంది మరణించగా.. మరో ఎనిమిది మంది గాయపడినట్లు పోలీసులు తెలిపారు. బీబీపుర్ గ్రామ సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదం జరిగింది ఇలా..
హరియాణాలోని జింద్​ జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం 9 గంటలకు జింద్ బస్టాండ్​ నుంచి బయళ్దేరిన ఆర్టీసీ బస్సు.. బీబీపుర్ గ్రామ సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వచ్చిన క్రూయిజర్ (తుపాన్ ప్యాసింజర్ వాహనం)ను ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా వ్యాన్​ ఎగిరిపడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. ఆ తర్వాత మరో రెండు మృతదేహాలను క్రుయిజర్​లో గుర్తించినట్లు సమాచారం. కాగా మృతులు అందరూ క్రుయిజర్​లో ప్రయాణిస్తున్న వారే. బస్సు డ్రైవర్​ సైతం ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. ఘటనా స్థలికి వెంటనే ఆరు అంబులెన్స్​లు చేరుకొని క్షతగాత్రులను హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించాయి. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated : Jul 10, 2023, 6:15 PM IST

ABOUT THE AUTHOR

...view details