Jharkhand Road Accident Today : ఝార్ఖండ్ హజారీబాగ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మంగళవారం మధ్యాహ్నం.. బొలెరో, బుల్లెట్ పరస్పరం ఢీకొన్నాయి. దీంతో బొలెరో అదుపుతప్పి పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను హజారీబాగ్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అసలేం జరిగిందంటే..
Car Fell Into Well Jharkhand : హజారీబాగ్.. పద్మ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోమి గ్రామ సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. బొలెరో, బైక్ పరస్పరం ఢీకొట్టడం వల్ల బొలెరో అదుపుతప్పి పక్కనే ఉన్న బావిలో పడిపోయినట్లు పేర్కొన్నారు. మృతుల్లో నలుగురు పురుషులు, ఒక మహిళ, ఒక చిన్నారి ఉన్నట్లు చెప్పారు. రెస్క్యూ టీమ్.. బావిలో దిగి మృతదేహాలను బయటకు తీసిందని చెప్పారు.