దేశ రాజధాని దిల్లీలో వలసకార్మికులను లాక్డౌన్ కష్టాలు వెంటాడుతున్నాయి. కరోనా కట్టడికి విధించిన ఆంక్షలను కేజ్రీ సర్కారు పదేపదే పొడగిస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు దిల్లీలోనే ఉన్న వలసకూలీలు స్వగ్రామాల బాట పడుతున్నారు.
కంపెనీలు మూసివేయడం, ఇతర పనులేవీ దొరకపోవడం లేదని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే సొంత రాష్ట్రానికి పయనమవుతున్నట్టు చెబుతున్నారు. దీంతో దిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ వలసకూలీలతో కిక్కిరిసిపోయింది.
"ఇక్కడ పని ఆగిపోయింది. మేం పేదవాళ్లం. మా అమ్మ పరిస్థితి విషమంగా ఉంది. తిండికి ఇబ్బందులు ఉన్నాయి. కంపెనీలు మూసేశారు. ఇక్కడే ఎన్నిరోజులు ఆకలితో ఉండాలి. అందుకే ఇంటికి వెళ్లిపోతున్నాం."
-రామ్జీ, వలసకూలీ