జమ్ముకశ్మీర్ షోపియాన్ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఉదయం జైనాపోరా ప్రాంతంలోని ముంజ్మార్గ్లో ఉగ్రవాదులున్నట్లు.. భద్రతా దళాలకు సమాచారం అందింది. వెంటనే సైన్యం, పోలీసులు కలిసి ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
జమ్ము కశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ముగ్గురు ముష్కరుల హతం - లేటెస్ట్ ఎన్కౌంటర్ న్యూస్
జమ్ము కశ్మీర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో లష్కరే తోయిబాకు చెందిన ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. పక్కా సమాచారంలో దాడులు నిర్వహించిన భద్రతా దళాలు.. విజయవంతంగా ఉగ్రవాదులకు ముట్టబెట్టారు.
జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్కౌంటర్
సైన్యాన్ని చూసిన ఉగ్రవాదులు ఒక్కసారిగా వారిపై కాల్పులు జరిపారు. సైన్యం కూడా ముష్కరులపై ఎదురుదాడి చేయగా.. లష్కరే తోయిబాకు చెందిన ముగ్గరు ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు వెల్లడించారు. వారినుంచి కొన్ని ఆయుధాలను స్వాధీనం చేసుకొన్నట్లు తెలిపారు. కశ్మీరీ పండిట్ పురాణ కృష్ణ భట్‌ను చంపడంలో వీరికి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.