మహారాష్ట్రలోని ముంబయి-పుణె జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఈ ఘటనలో ఓ కారు మరో వాహనాన్ని ఢీకొట్టగా..నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. గాయపడ్డ మరో ముగ్గురిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థాలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు దుర్మరణం - మహారాష్ట్ర లేటెస్ట్ అపేట్స్
మహారాష్ట్రలోని ముంబయి-పుణె జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు మరో వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయారు. గాయపడ్డ మరో ముగ్గురిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పుణె నుంచి ముంబయి వైపు వెళ్తున్న ఓ కారు ఢేకు గ్రామ పరిధికి చేరుకోగానే డ్రైవర్ అదుపు తప్పి ముందున్న వాహనాలను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఎనిమిది మందిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకుస్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ మరో ముగ్గురిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.