ఉత్తరాఖండ్లో మరో ఘోర ప్రమాదం జరిగింది. చమోలి జిల్లాలో ఓ వాహనం లోతైన లోయలో పడి 12 మంది మరణించిన ఘటన మరువకముందే మరో ప్రమాదం జరిగింది. ధారసు-యముమోత్రి జాతీయ రహదారిపై ఉదయం 11 గంటల సమయంలో ఉత్తరకాశీ నుంచి పురోలా వెళ్తున్న వాహనం దాదాపు 400 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒక మహిళ తీవ్రంగా గాయపడింది.
గాయపడిన మహిళను మొదట బ్రహ్మఖాల్‌లోని ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఉత్తరకాశీ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదం జరగడానికి కారణాలేంటో ఇంకా తెలియలేదు. అయితే డ్రైవర్ నిద్రమత్తులో ఉండడం వల్లే వాహనం లోయలో పడిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.