కేరళ ఇడుక్కిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శబరిమల నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం శుక్రవారం అర్థరాత్రి సమయంలో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతులు తమిళనాడు థేనీ జిల్లాలోని అండిపెట్టి ప్రాంతానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
శబరిమల యాత్రలో విషాదం.. లోయలో పడిన వాహనం.. 8 మంది భక్తులు మృతి - శబరిమల యాత్ర లేటెస్ట్ న్యూస్
కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శబరిమల నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల వాహనం అదుపుతప్పి లోయలో పడి ఎనిమిది మంది మృతి చెందారు.
శబరిమల యాత్రలో విషాదం
తమిళనాడు నుంచి 10 మంది యాత్రికులు శబరిమల నుంచి తిరిగి వస్తుండగా కుమిలి-కంబం రహదారిపై వెళ్తుండగా అదుపుతప్పి వాగులో బోల్తా పడింది. ఆ వాహనంలో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కొండ మలుపు వద్ద డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. 40 అడుగుల పైనుంచి వాహనం కింద పడడం వలన.. పూర్తిగా ధ్వసం అయిందని అధికారులు వెల్లడించారు.
Last Updated : Dec 24, 2022, 9:38 AM IST