బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 7 ప్రయాణికులు అక్కడిక్కడే మృతిచెందారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటన కటిహార్ జిల్లా కేంద్రానికి 10 కిలోమీటర్ల దూరంలో జరిగింది.
ఆటో-ట్రక్కు ఢీ.. ఒకే కుటుంబంలోని ఐదుగురు.. మొత్తం 7 మంది స్పాట్ డెడ్ - బిహార్ కటిహార్ రోడ్డు ప్రమాదం 5 ఓకే కుటుంబ మృతి
బిహార్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో, ట్రక్కు ఢీకొన్న ఘటనలో 7 ప్రయాణికులు అక్కడిక్కడే మృతిచెందారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు ఉన్నారు.
ఇదీ జరిగింది..
ఖేరియా గ్రామానికి చెెందిన ఓ కుటుంబంలోని ఐదుగురు ఆటోలో 81వ నెంబర్ జాతీయ రహదారిపై వెళ్తున్నారు. వేగంగా వస్తున్న ట్రక్కు.. ఆటోను ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో ఆటోను వెనుకనుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటో బోల్తో కొట్టి కొన్ని మీటర్ల వరకు వెళ్లి ఆగింది. ఆటోలో ఉన్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురితో పాటు మరో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
కాగా, ప్రమాదం తర్వాత ట్రక్కు ఆగకుండా వెళ్లిపోయింది. ప్రమాద ప్రాంతంలో గుమిగూడిన స్థానికులు.. కాలిన టైర్లు రోడ్డుపై వేసి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టు మార్టం పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించనున్నట్లు తెలిపారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు, దాని డ్రైవర్ కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.