తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో మళ్లీ హింస.. 8 మంది మృతి.. దీదీ సర్కార్​కు కేంద్రం నోటీసులు!

RAMPURHAT vilence
రెచ్చిపోయిన టీఎంసీ నేతలు

By

Published : Mar 22, 2022, 11:51 AM IST

Updated : Mar 22, 2022, 8:56 PM IST

11:47 March 22

రెచ్చిపోయిన టీఎంసీ నేతలు.. ఇళ్లకు నిప్పు.. 8 మంది మృతి

బంగాల్​లో మళ్లీ హింస.. ఇళ్లకు నిప్పు

Houses Set On Fire: బంగాల్​​లో మరోసారి హింస చెలరేగింది. బీర్భుమ్​ జిల్లా రాంపుర్​హట్​ ప్రాంతంలో మంగళవారం.. కొందరు దుండగులు ఇళ్లకు నిప్పుపెట్టగా 8 మంది సజీవదహనమయ్యారు. ఇందులో ఇద్దరు చిన్నారులున్నారు. మరో ఇద్దరు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి.. మంటలను ఆర్పివేసినట్లు వివరించారు.

తృణమూల్​ కాంగ్రెస్​ నేత, బర్షాల్​ గ్రామ పంచాయతీ డిప్యూటీ చీఫ్​ బహదూర్​ షేక్​ను సోమవారం ఎవరో హత్యచేశారు. దీంతో రెచ్చిపోయిన ఆయన అనుచరులు.. రాంపుర్​హట్​లోని 5 ఇళ్లకు నిప్పుపెట్టారు. 8 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

''ఈరోజు ఉదయం ఒకే ఇంటి నుంచి ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. అంతకుముందు 10 మంది చనిపోయారని వార్తలొచ్చాయి. అది నిజం కాదు. మొత్తం 8 మంది చనిపోయారు.'' ​

- మనోజ్​ మాలవీయ, బంగాల్​ డీజీపీ

ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలిపిన ఆయన.. ఇప్పటివరకు ఘటనకు సంబంధించి 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. సబ్​ డివిజనల్​ పోలీస్​ ఆఫీసర్​, సర్కిల్​ ఇన్​స్పెక్టర్​లను తొలగించినట్లు పేర్కొన్నారు. ఘటనపై విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు స్పష్టం చేశారు.

నివేదిక కోరిన కేంద్ర ప్రభుత్వం..

బంగాల్‌ ఘటనపై వీలైనంత త్వరగా పూర్తి నివేదిక అందించాలని కేంద్ర హోంశాఖ.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఉదంతంపై తగిన చర్యలు తీసుకోవాలని 9 మంది భాజపా ఎంపీల బృందం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిసిన అనంతరం.. ఈ ప్రకటన వెలువడింది.

ఘటన స్థలానికి సీఐడీ బృందం..

బీర్భుమ్​ ఘటనపై సీఐడీ బృందం దర్యాప్తు చేస్తోంది. ఇళ్లు కాలిపోయిన ప్రాంతానికి వెళ్లి అధికారులు పరిశీలించారు.

గవర్నర్​ వ్యాఖ్యలపై సీఎం..

ఈ ఘటనపై బంగాల్​ గవర్నర్‌ జగ్​దీప్‌ ధన్​కర్​ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం హింసను ప్రేరేపిస్తుందని, ఇది అత్యంత దారుణమైన ఘటన అని ఆరోపించారు. ఈ వాఖ్యలను ఖండించిన సీఎం మమతా బెనర్జీ.. రాజ్యాంగపరంగా గౌరవప్రదమైన పదవిలో ఉండి ఇలా అనాలోచితంగా మాట్లాడటం మానుకోవాలని గవర్నర్‌కు లేఖ రాశారు.

విచారణకు నడ్డా కమిటీ..

బంగాల్​ ఘటనపై విచారణ జరిపేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు భాజపా అధ్యక్షుడు నడ్డా. ఇందులో నలుగురు ఎంపీలు ఉన్నారు. వీరంతా ఘటనా స్థలాన్ని పరిశీలిస్తారని ఆయన పేర్కొన్నారు. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ఇవీ చూడండి:క్షీణించిన లాలూ ఆరోగ్యం.. రాంచీ నుంచి దిల్లీకి తరలింపు!

జయలలిత మృతిపై విచారణ.. కమిషన్ ఎదుట హాజరైన ఓపీఎస్​

Last Updated : Mar 22, 2022, 8:56 PM IST

ABOUT THE AUTHOR

...view details