ఉత్తర్ ప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మౌ జిల్లాలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగి.. ఒకే కుటుంబానికి చెందిన ఐదురుగు సజీవ దహనమయ్యారు. ఈ ఘటన షాపుర్ గ్రామంలో మంగళవారం రాత్రి జరిగినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో ఓ మహిళ, పురుషుడితో పాటుగా.. ముగ్గురు మైనర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో ఇల్లు కూడా పూర్తిగా ధ్వంసమైంది.
అర్ధరాత్రి ఇంట్లో చెలరేగిన మంటలు.. ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవ దహనం - up fire tragedy
ఉత్తర్ప్రదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. మౌ జిల్లాలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగి.. ఒకే కుటుంబానికి చెందిన ఐదురుగు సజీవదహనమయ్యారు.
![అర్ధరాత్రి ఇంట్లో చెలరేగిన మంటలు.. ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవ దహనం fire breaks out in uttar pradesh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17328902-thumbnail-3x2-fireeee.jpg)
అగ్ని ప్రమాదం
వెంటనే సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఇంట్లో గ్యాస్ స్టవ్ నుంచి మంటలు చెలరేగడమే ఇందుకు కారణమని.. అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. దీనిపై పుర్తి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Last Updated : Dec 28, 2022, 11:32 AM IST