ప్రమాదవశాత్తు విద్యుత్ స్తంభం.. హైటెన్షన్ వైర్లను తాకడం వల్ల రైల్వే ట్రాక్‌పై విధులు నిర్వర్తిస్తున్న ఆరుగురు కూలీలు మరణించారు. ఈ ఘటన ఝార్ఖండ్‌లో జరిగింది. సమాచారం అందుకున్న రైల్వే డీఆర్‌ఎం.. ఘటనపై విచారణ జరిపేందుకు బృందాన్ని ఏర్పాటు చేశారు. నివేదిక రాగానే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాంట్రాక్ట్ ఏజెన్సీ తీవ్ర నిర్లక్ష్యం వల్లే కూలీలు ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు.
కూలీలు మృతి చెందిన ప్రదేశం ఇదే రైల్వే డీఆర్‌ఎం తెలిపిన వివరాల ప్రకారం.. ధన్‌బాద్ జిల్లాలోని జార్ఖోర్ ప్రాంతంలోని నిచిత్‌పుర్ హాల్ట్‌లో కూలీలు స్తంభాన్ని గుంతలో ఏర్పాటు చేస్తుండగా సోమవారం ఈ ప్రమాదం జరిగింది. స్తంభం నేరుగా 25000 వోల్ట్ వైర్‌ను తాకింది. దీంతో స్తంభాన్ని పట్టుకున్న ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్, స్థానిక పోలీసులు డీఆర్‌ఎం కమల్ కిషోర్ సిన్హాతో కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కూలీలందరూ లతేహర్, పాలము, అలహాబాద్‌కు చెందిన వారుగా గుర్తించారు.
మృతదేహాలను శవపరీక్షలకు తీసుకెళ్తున్న వైద్య సిబ్బంది "గొయ్యిలో పెద్ద స్తంభాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద స్తంభాల ఏర్పాటుకు అనుమతులు లేవు. కేవలం చిన్నవాటికే రైల్వే శాఖ అనుమతి ఇచ్చింది. పవర్ బ్లాక్ తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్ పైన లైవ్ వైర్లు ఉన్నాయి. అందులో 25000 వోల్టుల కరెంట్ ఎప్పుడూ ఉంటుంది. కాంట్రాక్ట్ ఏజెన్సీ నిర్లక్షం వల్లే ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించారు" అని డీఆర్‌ఎం కమల్ కిషోర్ తెలిపారు.
అంబేడ్కర్ జయంతి వేడుకల్లో అపశృతి!
గతనెల మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని కార్గిల్నగర్లో జరిగిన అంబేడ్కర్ జయంతి వేడుకల్లో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా నిర్వహించిన ఊరేగింపు ర్యాలీలో ఈ ప్రమాదం జరిగింది. కగ్గిల్ చౌక్ నుంచి పాదయాత్ర ముగించుకుని కార్యకర్తలు ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఆ సమయంలో ఊరేగింపు వాహనంపై ఆరుగురు నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో వాహనంపై ఉన్న కరెంట్ ఇనుప రాడ్డు పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్కు తగిలి ప్రమాదవశాత్తు ట్రాలీలో ఉన్న యువకులపై పడింది. ఈ కథనం పూర్తి వివరాల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.