హరియాణా పాల్వల్ జిల్లాలో అంతుచిక్కని జ్వరం (Mysterious Fever) కలకలం రేపుతోంది. హథిన్ ప్రాంతంలో గడిచిన పది రోజుల్లో 24 మంది చిన్నారులు మరణించారు. చిల్లీ గ్రామంలో 11 మంది సహా మరో రెండు చోట్ల 13 మంది మృతిచెందారు. మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ జ్వరం బారిన పడినవారి సంఖ్యతో పాటు మృతులు పెరగడం వల్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
జ్వరం(mysterious fever symptoms) బారినపడిన రెండు రోజులకే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తన చిన్నారి మరణించినట్లు బాధిత తల్లిదండ్రులు తెలిపారు. ప్లేట్లెట్స్ కౌంట్ భారీగా తగ్గిపోయి.. తొమ్మిది నెలల పసికందు చనిపోయింది. అయితే ఆ శిశువు డెంగ్యూతో చనిపోయినట్లు వైద్యులు చెబుతున్నారు.