తెలంగాణ

telangana

ETV Bharat / bharat

9 రోజుల్లోనే ఎవరెస్టు బేస్​ క్యాంప్​కు.. ఏడేళ్ల బాలిక సాహసం!

ఏడేళ్ల బాలిక.. ఎవరెస్టు శిఖరం బేస్​ క్యాంప్​కు చేరుకుని అతిపిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. అక్కడి ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయలేదు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? తన ఎవరెస్టు ప్రయాణం ఎలా సాగింది.

7 years old girl reach mount everest
ఎవరెస్ట్​ బేస్​ క్యాంపుపై జెండా ఎగుర వేసిన సాన్వీ సూద్

By

Published : Jun 11, 2022, 3:02 PM IST

పంజాబ్​లోని రోపర్‌కు చెందిన సాన్వీ సూద్ అనే ఓ ఏడేళ్ల బాలిక చరిత్ర సృష్టించింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే ఎవరెస్టు బేస్​ క్యాంపునకు చేరుకుంది. ఆ ప్రాంతానికి చేరుకున్న అతిపిన్న వయస్కురాలిగా రికార్డ్​ నెలకొల్పి అందరి మన్ననలు పొందుతోంది. 65 కిలోమీటర్ల ట్రాక్​లో ఎన్ని అవాంతరాలు ఎదురైన.. బెదరక బేస్​ క్యాంప్​కు చేరుకుని.. అక్కడ భారత జాతీయ పతాకాన్ని ఎగురవేసింది. విపరీతమైన చలి, బలమైన గాలులను సైతం తట్టుకుంటూ ఈ ప్రయాణాన్ని కొనసాగించింది. ఆక్సిజన్ అంతంత మాత్రంగానే అందినా తన ఎవరెస్ట్ ప్రయాణంలో ఎక్కడా బెదరలేదు.

ఎవరెస్ట్​ బేస్​ క్యాంపుపై జెండా ఎగుర వేసిన సాన్వీ సూద్

సాన్వీ సూద్​.. మొహలీలోని యాదవీంద్ర స్కూల్‌లో రెండో తరగతి చదువుతోంది. ఎవరెస్టుపై 5,364 మీటర్ల ఎత్తులోని బేస్​ క్యాంప్​లో ఒక రోజు నివసించాలని బలంకా సంకల్పించుకుంది. అందుకు తగినట్లుగా సన్నద్ధమైన తన ప్రయాణాన్ని సాగించింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే అక్కడికి చేరుకుని ఔరా అనిపించింది. సాన్వీ ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని తన గమ్యస్థానాన్ని చేరుకున్న సాన్వీని అభినందిస్తున్నారు.

ఎవరెస్ట్​ బేస్ క్యాంపును అధిరోహిస్తున్న బాలిక

ABOUT THE AUTHOR

...view details