జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాకు చెందిన సామియా(7) అనే బాలిక అద్భుతమైన ఘనతను సాధించింది. గోవాలో జరిగిన అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకాన్ని గెలుచుకుంది. పోటీలో పాల్గొన్న జపాన్, నేపాల్, బంగ్లాదేశ్ క్రీడాకారులను వెనక్కి నెట్టి నంబర్ వన్‌గా నిలిచింది. పోటీలో అద్భుతమైన ప్రదర్శనను కనబరుస్తూ ప్రత్యర్థులను చిత్తుచేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. "నాకు దేన్నైనా సాధించగలననే నమ్మకం వచ్చింది. ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు భయపడే నేను ఇప్పుడు కరాటే ప్రదర్శనతో ఎవరినైనా ఎదిరించి పోరాడగలననే నమ్మకం వచ్చింది. బాలికలకు అవకాశాలు కల్పిస్తే తమని తాము రక్షించుకోగలర"ని సామియా చెప్పింది.
కరాటేలో ఏడేళ్ల బాలిక రికార్డు.. అంతర్జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ - జమ్ముకశ్మీర్ వార్తలు
అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌లో ఏడేళ్ల బాలిక బంగారు పతకాన్ని సాధించింది. జపాన్, నేపాల్, బంగ్లాదేశ్ క్రీడాకారులను ఓడించి అద్భుత విజయాన్ని కైవసం చేసుకుంది.
అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్
సామియా ఇంతకు ముందు చాలా పోటీలలో పాల్గొంది. "నా చెల్లెలు చిన్న వయసులో ఇంత ఘనత సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. సామియా మేము ప్రోత్సహించేవాళ్లం. ఇప్పుడు ఆమె అనుకున్నది సాధించి ఈ మెడల్ పొందింద"ని సామియా సోదరి అన్నారు. "సామియా చాలా ప్రతిభావంతురాలు. ఆమెకు మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తి ఉంది. గోవాలో ఈ మెడల్ గెలుచుకున్న ఆమె, బాలికలు, మహిళలు ఎందులోనూ తక్కువకారని నిరూపించింద"ని సానియా కోచ్ జీఎం పాల అన్నారు.
Last Updated : Nov 19, 2022, 11:34 AM IST