Daughter taking care mother: ఏడేళ్ల చిన్నారి.. వయసుకు మించిన బాధ్యతలను భుజానకెత్తుకుంది. తన బాగోగులు తానే చూసుకోలేని వయసులో అనారోగ్యంతో ఉన్న తల్లికి సపర్యలు చేస్తోంది. తమ్ముడినీ చూసుకుంటోంది. అమ్మకే అమ్మ అయిన ఆ చిన్నారిని చూసిన వారి మనుసులు బాధతో బరువెక్కుతున్నాయి.
Woman with spinal cord problem in up: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన కేలాదేవీ.. గత కొన్నిరోజులుగా వెన్నెముక సంబంధిత సమస్యతో బాధపడుతోంది. ఫలితంగా ఆమె తరుచూ అనారోగ్యానికి గురయ్యేది. దీంతో.. భర్త, కుటుంబం ఆమెను వదిలేసింది. ఈ పరిస్థితుల్లో.. ఇళ్లల్లో పని చేస్తూ తన ఇద్దరు పిల్లలను కేలాదేవీ పోషించుకునేది. ఆ తర్వాత.. కొన్నాళ్లపాటు పొగాకు ఉత్పత్తులు అమ్ముతూ జీవితాన్ని నెట్టుకొచ్చింది. అయితే.. ఇటీవల ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించసాగింది. దీంతో ఆగ్రాలోని జిల్లా ఆస్పత్రిలో చికిత్స కోసం చేరింది.
Daughter as mother: ఆస్పత్రిలో వైద్యులు ఆమె వెన్నెముకకు శస్త్రచికిత్స చేయాలని చెప్పారు. అందుకయ్యే ఖర్చును భరించే స్థోమత ఆమెకు లేదు. దాంతో అదే ఆస్పత్రిలో కొద్దిరోజులుగా ఉంటోంది. ఈ క్రమంలో తన ఏడేళ్ల కుమార్తె ప్రీతా ప్రజాపతి... అన్నీ తానై కేలాదేవికి సేవలు చేస్తోంది. అన్నం తినిపించడం మెదలుకొని.. ఇతర అవసరాలన్నీ తీరుస్తోంది. అంతేకాదు.. ఒకటో తరగితి చదివే తన తమ్ముడు సత్యం కుమార్ బాగోగులూ తనే చూసుకుంటోంది. ఓ వైపు తల్లిని, తమ్ముడిని చూసుకుంటూ, ఇంటిపనులు చేస్తూ... పాఠశాలకు వెళ్తోంది. ఖాళీ దొరికిన సమయాల్లో హోంవర్క్ చేస్తోంది.
ప్రీతా ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతోంది. అయితే... తాను భవిష్యత్తులో వైద్యురాలిని అవుతానని చెబుతోంది. అప్పుడు తన తల్లికి మెరుగైన చికిత్స అందిస్తానని అంటోంది.