Peacocks killed: తమిళనాడు తిరుపత్తూర్లో ఏడు నెమళ్లకు విషమిచ్చి చంపిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతడిని ఇరునపత్తు ప్రాంతానికి చెందిన మేఘనాథన్గా గుర్తించారు. అతని రెండెకరాల పొలంలోకి నెమళ్లు తరచూ ఆహారం కోసం వచ్చి పంట నాశనం చేస్తున్నాయని, అందుకే ఎలుకల మందును ధాన్యంలో కలిపి మయూరాలకు ఆహారంగా వేశాడని పోలీసులు తెలిపారు. అవి తిని నెమళ్లు చనిపోయాయని పేర్కొన్నారు. గ్రామస్థులు ఇచ్చిన సమాచారంతో మేఘనాథ్ను అరెస్టు చేసినట్లు చెప్పారు. అతడ్ని వెల్లోర్ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.
జాతీయ పక్షి అయిన నెమలిని చంపితే కఠిన శిక్ష ఎదుర్కోక తప్పదని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుందని తెలిపారు.