రైతుల సమస్యలు, పెగాసస్ ఫోన్ ట్యాపింగ్ వంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ మినహా ఏడు విపక్ష పార్టీలు రాష్ట్రపతిని కోరాయి. ఆయా అంశాలపై పార్లమెంటులో చర్చించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేస్తూ రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశాయి. పార్లమెంటు నియమనిబంధనలు, భారత రాజ్యాంగం గౌరవాన్ని కాపాడేందుకు ఈమేరకు చొరవ చూపాలని అభ్యర్థించాయి.
బీఎస్పీ, ఆర్ఎల్పీ, ఎస్ఏడీ, నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఐ, సీపీఎంతో పాటు ఎన్సీపీకి సంబంధించిన నేతలు లేఖపై సంతకాలు చేశారు. అయితే పార్లమెంట్లో కీలక పార్టీలైన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఈ కూటమికి దూరంగా ఉండడం గమనార్హం.