జమ్ముకశ్మీర్‌లోని అవంతిపొరాలో ఏడుగురు ఉగ్రవాద అనుచరులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారంతా జైష్-ఎ-మహ్మద్ ఉగ్రసంస్థకు చెందినవారని తెలిపారు. సీఆర్పీఎఫ్తో కలిసి ఈ దాడులు నిర్వహించారు పోలీసులు. ఇందులో భాగంగా ఉగ్రసంస్థలో చేరేందుకు యత్నించిన మరో ఆరుగురిని కూడా అడ్డుకున్నట్లు వెల్లడించారు.
జమ్ముకశ్మీర్‌లో ఏడుగురు ఉగ్ర అనుచరులు అరెస్టు - జైష్-ఎ-మహ్మద్
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేశారు. సీఆర్పీఎఫ్ జవాన్లతో కలిసి జరిపిన దాడుల్లో.. యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్న ముఠాను అరెస్టు చేశారు.
జమ్ముకశ్మీర్‌లో ఉగ్ర సహచరులు అరెస్టు
పాకిస్థాన్‌కు చెందిన కొందరు కమాండర్లు ఈ యువతను తప్పుదోవ పట్టించి ఉగ్రవాదులుగా మారేలా ప్రేరేపించినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దాంతో పాటే అవంతిపొరా, త్రాల్‌లోని క్షేత్రస్థాయి ముష్కరులతో సంబంధం ఏర్పరచుకునేలా ప్రోత్సాహించినట్లు అధికారులు తెలిపారు.