పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభం(punjab congress crisis) దాదాపు ముగిసినట్లేనని భావిస్తున్న ఆ పార్టీ అధిష్ఠానానికి ఊహించని షాక్ ఇచ్చారు నవ్‌జ్యోత్ సింగ్ సిద్దూ. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేశారు(navjot singh sidhu resigns). ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ పంపారు(punjab congress news today ). రాజీపడితే వ్యక్తిత్వాన్ని కోల్పోయినట్లేనని, అందుకు తాను సిద్ధంగా లేనని లేఖలో పేర్కొన్నారు. పంజాబ్ భవిష్యత్, సంక్షేమ అజెండా విషయంలో రాజీపడటం ఇష్టంలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పీసీసీ బాధ్యతలు చేపట్టిన రెండు నెలల్లోనే సిద్ధూ తప్పుకోవడం(navjot singh sidhu news) గమనార్హం.
మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా(punjab cm resign) అనంతరం దళిత వర్గానికి చెందిన చరణ్‌జీత్ సింగ్‌ను నూతన సీఎంగా(punjab cm news) నియమించింది కాంగ్రెస్ అధిష్ఠానం(punjab congress news). నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ, అమరీందర్ విభేదాలతో గతకొద్ది నెలలుగా పంజాబ్ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభం ఇక సమసిపోయినట్లేనని భావించింది. కానీ సిద్ధూ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో ఆ పార్టీ మరో ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొద్ది నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో ఇలాంటి పరిణామాలు జరుగుతుండటం కాంగ్రెస్‌ను అయోమయంలో పడేస్తున్నాయి. అమరీందర్ సింగ్ భాజపాలో చేరతారని ఊహాగానాలు వస్తుండటం, పార్టీలో ప్రజాదరణ ఉన్న నేతలు ఎవరూ కన్పించకపోవడం, సీఎం చన్నీకి అనుభవం లేకపోవడం పార్టీని కలవరానికి గురి చేస్తోంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో అధికారం నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది? ఎవర్ని తెరపైకి తెస్తుంది? ఆ పార్టీ వ్యూహాలు ఎలా ఉంటాయి? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
'నేను ముందే చెప్పా'
పీసీసీ చీఫ్‌గా సిద్ధూ(navjot singh sidhu news) తప్పుకున్న వెంటనే.. అమరీందర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. సిద్దూకు స్థిరత్వం లేదని తాను ముందునుంచే చెబుతున్నానని, పంజాబ్ లాంటి సరిహద్దు రాష్ట్రానికి ఆయన తగరని పేర్కొన్నారు. అయితే భాజపాలో చేరేందుకే అమరీందర్ దిల్లీ వెళ్లారని, అమిత్ షాను కలిసి కమలంపార్టీ కండువా కప్పుకుంటారని వచ్చిన ఊహాగానాలపై ఆయన స్పందించారు. ప్రస్తుతం ఏ రాజకీయ నాయకుడిని కలవడం లేదని, సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసేందుకే దిల్లీ వచ్చినట్లు వివరించారు.
సిద్ధూ రాజీనామాపై ఆమ్ఆద్మీ పార్టీ సైతం విమర్శలు గుప్పించింది. దళితుడు, పేద కుటుంబానికి చెందిన చరణ్‌జీత్ సింగ్ చన్నీ సీఎం కావడం జీర్ణించుకోలేకే సిద్ధూ తన పదవి నుంచి తప్పుకున్నారని ఆరోపించింది. అది అత్యంత బాధాకరమని వ్యాఖ్యానించింది. పాకిస్థాన్‌తో 550కి.మీ సరిహద్దు ఉన్న పంబాబ్‌కు సిద్ధూ లాంటి అస్థిర నాయకుడు కరెక్ట్ కాదని విమర్శించింది. పంజాబ్ కాంగ్రెస్‌లో అరాచక సంక్షోభానికి ఇది నిదర్శమని దుయ్యబట్టింది.
సిద్ధూ రాజీనామా అందుకేనా..