అది తమిళనాడులోని వేలూరు కోట(vellore fort tamil nadu). 1806 జులై 9వ తేదీ రాత్రి కోలాహలంగా గానా బజానా జరిగింది. ఆటపాటలతో ఆహ్లాదం పొందిన కోటలోని సిపాయిలు తెలతెలవారుతుండగా తుపాకులు పట్టి తిరుగుబాటు(sepoy revolt in india) చేశారు. ఈస్టిండియా కంపెనీకి చెందిన 200 మంది తెల్లవాళ్లను హతమార్చారు. కోటపై టిప్పు సుల్తాన్ పులి పతాకను ఎగురవేసి, అక్కడే బందీగా ఉన్న టిప్పు కుమారుడు ఫతే హైదర్‌ను తమ రాజుగా ప్రకటించారు. హైదర్ తల్లి రోషనీ బేగం ఆంధ్రప్రదేేశ్‌లోని ఆదోనికి చెందిన నర్తకి. టిప్పు సుల్తాన్ యువరాజుగా ఉన్న రోజుల్లోనే రోషనీ బేగం మైసూరుకు చేరి రాజదర్బారులో నాట్యం చేసేవారు. టిప్పుకీ ఆమెకు కలిగిన సంతానమే ఫతే హైదర్. 1799లో ఈస్టిండియా కంపెనీ సైన్యం శ్రీరంగ పట్నం యుద్ధంలో టిప్పును హతమార్చి, ఆయన అంతఃపురంలోని 550 మంది మహిళలను 1802లో తమిళనాడులోని వేలూరు కోటకు తరలించింది. వారికి టిప్పు భార్యగా రోషనీ బేగం పెద్దరికం వహించేవారు. రానురానూ వేలూరు కోటలో రాజకుటుంబీకుల సంఖ్య 790కి పెరిగింది. వీరికి రాజ భరణాల కింద చెల్లింపులు మరీ ఎక్కువైపోయాయని తలచిన నాటి మద్రాసు గవర్నర్ విలియం బెంటింక్ ఆ చెల్లింపులకు కోతవేశారు. ఇది సహజంగానే రోషనీని బాధపెట్టింది(azadi ka amrut mahotsav).
మరోవైపు కోటలోని భారతీయ సిపాయిలు నుదుట విభూతి పెట్టుకోరాదనీ, గడ్డాలు పెంచకూడదనీ ఈస్టిండియా కంపెనీ(east india company history) ఉత్తర్వులు జారీ చేసింది. తలపాగాలూ ధరించకూడదనీ, వాటి బదులు తెల్లవాళ్లు ధరించే టోపీ వంటిది పెట్టుకోవాలన్నది. అంతటితో ఆగకుండా శిలువ లాంటి వస్తువును మెడలో ధరించాలని నిర్బంధపెట్టింది. ఇదంతా తమను క్రైస్తవ మతంలోకి మార్పించడానికే చేస్తున్నారని హిందూ, ముస్లిం సిపాయిలు ఆగ్రహించారు. టిప్పు రాజ్యం పతనమైన తరవాత ఆదరణ కరవైన ఫకీర్లు కూడా ఈస్టిండియా కంపెనీపై తిరగబడవలసిందిగా సిపాయిలను రెచ్చగొట్టసాగారు. తెల్లవాళ్లు, క్రైస్తవులు ధరించే టోపీలను పెట్టుకోవలసిందిగా సిపాయిలను బలవంతం చేయడం వారి మతాన్ని మార్పించడానికేనని వేలూరు వీధుల్లో ఫకీర్లు ప్రచారం చేయసాగారు. దాంతో టోపీలు ధరించడానికి సిపాయిలు, వారి నాయకులు నిరాకరించారు. దీనికి ప్రతిగా ఈస్టిండియా అధికారులు ఒక హిందూ, ఒక ముస్లిం హవల్దారును 900 కొరడా దెబ్బలు కొట్టి శిక్షించారు. ఇది వేలూరు కోటలో తిరుగుబాటు(sepoy mutiny in vellore) వాతావరణం ఏర్పడటానికి కారణమైంది. పరిస్థితి నివురు గప్పిన నిప్పులా తయారైంది.
200 మంది తెల్లవాళ్లను హతమార్చారు..