తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇస్రో కొత్త ఛైర్మన్​గా రాకెట్​ సైంటిస్ట్​ సోమనాథ్​ - ఇస్రో వార్తలు

ISRO new Chairman: ఇస్రో కొత్త ఛైర్మన్​గా సీనియర్​ రాకెట్​ సైంటిస్ట్​ ఎస్​. సోమనాథ్​ నియామకానికి కేబినెట్​ కమిటీ ఆమోదం తెలిపింది. ఇంతవరకు సోమనాథ్​.. తిరువనంతపురంలోని విక్రం సారభాయ్‌ అంతరిక్ష కేంద్రం సంచాలకునిగా వ్యవహరించారు.

isro chairman
సీనియర్​ సైంటిస్ట్​ సోమనాథ్​

By

Published : Jan 12, 2022, 7:55 PM IST

ISRO Chairman: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ-ఇస్రో ఛైర్మన్‌గా సీనియర్‌ రాకెట్‌ సైంటిస్ట్‌ ఎస్‌.సోమనాథ్‌ నియమితులయ్యారు. నియామకాల కేబినెట్ కమిటీ అందుకు ఆమోదం తెలిపింది. ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ పదవీకాలం ఈనెల 14న పూర్తి కానుండటం వల్ల సోమనాథ్‌ నియామకం జరిగింది.

సోమనాథ్​ను ఇస్రో ఛైర్మన్​గా నియమిస్తూ కేంద్రం ఆదేశాలు
ఇస్రో కొత్త ఛైర్మన్​ సోమనాథ్​

ఇంతవరకు సోమనాథ్ తిరువనంతపురంలోని విక్రం సారభాయ్‌ అంతరిక్ష కేంద్రం సంచాలకునిగా వ్యవహరించారు. కొల్లాంలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన ఆయన బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో ఎయిరోస్పేస్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్‌ చేశారు. 1985లో ఇస్రోలో చేరిన సోమనాథ్ ఉపగ్రహ వాహననౌకల డిజైనింగ్‌లో కీలకభూమికి పోషించారు.

ఇదీ చూడండి:'ఒమిక్రాన్​ను సాధారణ జలుబుగా భావించవద్దు'

ABOUT THE AUTHOR

...view details