HC on AB Venkateswara Rao Leave Petition: ఆర్జిత సెలవులపై.. విదేశాలకు వెళ్లేందుకు సీనియర్ IPS అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు అనుమతివ్వాలని.. ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. AB వెంకటేశ్వరరావు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి నిరాకరిస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను.. హైకోర్టు రద్దు చేసింది. అర్జిత సెలవులపై 41 రోజులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని AB వెంకటేశ్వరరావు.. గతంలో ప్రభుత్వానికి దరఖాస్తు చేయగా.. C.S. దానిని తిరస్కరించారు. ఈ నేపథ్యంలో C.S. జారీ చేసిన మెమోను సస్పెండ్ చేసి విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని.. AB వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. వాదనలు విన్న న్యాయస్థానం AB వెంకటేశ్వరరావుకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు లైన్ క్లియర్.. విదేశాలకు వెళ్లేందుకు అనుమతించాలని హైకోర్టు ఆదేశం - HC on AB Venkateswara Rao Leave Petition
11:19 July 06
సీఎస్ ఇచ్చిన ఉత్తర్వులు సస్పెన్షన్
ఆర్జిత సెలవులపై 41 రోజులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని చేసిన అభ్యర్థనను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్పై సోమవారం వాదనలు పూర్తి కావడంతో మంగళవారం నిర్ణయాన్ని ప్రకటిస్తామని న్యాయమూర్తి వెల్లడించారు. అయితే సాంకేతిక కారణాలు చూపుతూ మంగళవారం అనుబంధ పిటిషన్ను తోసిపుచ్చారు. అనుమతి నిరాకరిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని అనుబంధ పిటిషన్లో కోరకుండా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని మాత్రమే కోరారని గుర్తు చేసింది. సీఎస్ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తేనే తదనంతర పర్యావసానంగా విదేశాలకు అనుమతిచ్చే వ్యవహారం ఉత్పన్నమవుతుందని తెలిపింది. దీంతో అనుబంధ పిటిషన్ను కొట్టేస్తున్నట్లు, విచారణను ఈ నెల 7కి వాయిదా వేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది.
వెంటనే పిటిషనర్ తరఫు న్యాయవాది శరత్ చంద్ర వెంటనే స్పందిస్తూ.. తాము దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లో చోటుచేసుకున్న సాంకేతిక పొరపాటు కారణంగా పిటిషనర్ వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభావం పడుతోందన్నారు. లోపాన్ని సరిదిద్దుకొని వెంటనే అనుబంధ పిటిషన్ దాఖలు చేస్తానని మధ్యాహ్నం విచారణ చేయాలని కోరారు. అందుకు అనుమతిచ్చిన హైకోర్టు.. మధ్యాహ్నం విచారణ జరిపి బుధవారానికి వాయిదా వేసింది. అనంతరం అనుబంధ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును నేటికి వాయిదా వేసింది. దానికి అనుగుణంగా ఆర్జిత సెలవులపై.. విదేశాలకు వెళ్లేందుకు సీనియర్ IPS అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు అనుమతివ్వాలని.. ప్రభుత్వాన్ని హైకోర్ట్ ఆదేశించింది. సీఎస్ ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేసింది.
సోమవారం వాదనలు ఇలా: ఆర్జిత సెలవులపై తాను 41 రోజులు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో అత్యవసర వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై న్యాయవాది శరత్‌చంద్ర వాదనలు వినిపించారు. పిటిషనర్ విజ్ఞప్తిని సీఎస్ తిరస్కరించారని.. శాఖాపరమైన విచారణ 2021 నుంచి పెండింగ్‌లో ఉందని కోర్టుకు నివేదించారు. దాన్ని కారణంగా చూపుతూ పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించడానికి వీల్లేదని కోర్టుకు తెలిపారు.