తెలంగాణ

telangana

ETV Bharat / bharat

తాగొచ్చి రచ్చ చేసిన వరుడు.. పెళ్లి కుమారుడ్నే మార్చేసిన వధువు తండ్రి - rajasthan wedding cancel news

Drunk Groom: పెళ్లికి ఫుల్లుగా తాగి వచ్చి రచ్చ రచ్చ చేశాడు ఓ వరుడు. ముహూర్తం సమయం దాటి పోతున్నా పట్టించుకోకుండా డీజేకు డాన్సులు చేశాడు. దీంతో చిర్రెత్తిపోయిన పెళ్లికూతురు తండ్రి.. ఆమెకు మరొకరితో వివాహం చేసి ఊహించని షాక్ ఇచ్చాడు.

seeing-drunk-groom-father-refused-to-give-daughter
పెళ్లికి తాగొచ్చి రచ్చ చేసిన వరుడు

By

Published : May 18, 2022, 9:46 AM IST

Rajasthan wedding news: రాజస్థాన్​ చురూ జిల్లా చెలానా గ్రామంలో పెళ్లికుమారుడికి ఊహించని షాక్ ఇచ్చాడు పెళ్లికూతురు తండ్రి. అతడు చేసిన పనికి చిర్రెత్తి పోయి ఆమెకు అప్పటికప్పుడు మరో యువకుడితో పెళ్లి చేశాడు. దీంతో కంగుతున్న వరుడి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వరుడి నిర్లక్ష్యం వల్లే అతనికి ఈ పరిస్థితి తలెత్తింది.

హరియాణాకు చెందిన అనిల్ జాట్ కుమారుడు మహవీర్​ జాట్​కు చురు జిల్లాల్లోని చెలానా గ్రామానికి చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. మే 15(ఆదివారం) ముహూర్తం పెట్టారు. అయితే పెళ్లిరోజు హడావుడి చేద్దామనుకున్న వరుడు 150మందితో కలిసి ఊరేగింపుగా పెళ్లికూతురు ఇంటికి వెళ్లాడు. స్నేహితులతో కలిసి ఫుల్లుగా తాగి డాన్స్​ చేస్తూ రచ్చ చేశాడు. అర్ధరాత్రి సమయం 1:00 దాటినా పెళ్లిమండపానికి వెళ్లలేదు. డాన్స్ ఆపాలని చెప్పిన పెళ్లికూతురు తండ్రితో వరుడి బంధువులు గొడవకు దిగారు. తాగిన మత్తులో అలాగే డాన్స్ చేశారు. ముహూర్తం సమయం కూడా దాటి పోయింది. దీంతో చిర్రెత్తి పోయిన వధువు తండ్రి ఆమెకు అప్పటికప్పుడు మరో యువకుడితో పెళ్లి చేశాడు.

పెళ్లికి తాగొచ్చి రచ్చ చేసిన వరుడు

ఈ విషయం తెలిసి మహవీర్ కుటుంబ సభ్యులు కంగుతిన్నారు. సోమవారం పోలీస్ స్టేషన్​కు వెళ్లి వధువు కుటుంబంపై ఫిర్యాదు చేశారు. పెళ్లి రోజే ఇంత నిర్లక్ష్యంగా ఉన్న యువకుడు తన కూతురుని జీవితాంతం బాగా ఎలా చూసుకుంటాడని వధువు తండ్రి ప్రశ్నించాడు. దీంతో పోలీసులు ఇరు కుటుంబాలతో చర్చలు జరిపారు. చివరకు ఇరు పక్షాలు రాజీ కుదుర్చుకున్నాయి.

పెళ్లికి తాగొచ్చి రచ్చ చేసిన వరుడు

ఇదీ చదవండి:ప్రేయసికి మరొకరితో నిశ్చితార్థం.. తుపాకీతో కాల్చి చంపిన ప్రియుడు

ABOUT THE AUTHOR

...view details