టీ20 ప్రపంచకప్‌లో(T-20 World Cup) భాగంగా ఇటీవల జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌లో((india pak match)) పాక్ జట్టు విజయం సాధించడాన్ని స్వాగతిస్తూ పలువురు సంబరాలు చేసుకోవడం(pakistan win celebrated in india) ప్రకంపనలు సృష్టిస్తోంది. జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఆరోపణలపై దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఓ ప్రైవేటు ఉపాధ్యాయురాలు సహా పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. జమ్ముకశ్మీర్‌లో 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా దీనిపై స్పందించిన ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్.. పాక్ గెలుపుపై సంబరాలు చేసుకుంటున్న వారిపై దేశద్రోహం కేసులు(Sedition law) నమోదు చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు భారత క్రికెట్ జట్టుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు(pakistan win celebrated in india) చేసిన ఐదుగురిని కస్టడీలోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. బదాయూకు చెందిన నియాజ్ అనే వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేసినట్లు సీనియర్ ఎస్పీ ఓపీ సింగ్ తెలిపారు. మ్యాచ్ ముగిసిన తరువాత పాకిస్థాన్ జెండాను ఫేస్బుక్లో పోస్ట్ చేసి, ఆ దేశానికి మద్దతుగా పలు వ్యాఖ్యలు జోడించినట్లు చెప్పారు. అతనిపై దేశ ద్రోహం కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.
మరోవైపు పాకిస్థాన్ క్రికెట్ జట్టు విజయం నేపథ్యంలో వ్యాఖ్యలు చేసిన ఏడుగురిపై ఆగ్రా, బరేలి, సీతాపుర్‌లో మొత్తం 5 కేసులు నమోదైనట్టు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. వీరిలో ఆగ్రాలో ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్న ముగ్గురు కశ్మీర్ విద్యార్థులు కూడా ఉన్నారు.
రాజస్థాన్లో..