తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశద్రోహ చట్టంపై నిర్ణయం తీసుకుంటారా? లేదా?'

Sedition Law: దేశ ద్రోహ చట్టం 124ఏ రాజ్యాంగబద్ధతపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది సుప్రీంకోర్టు ధర్మాసనం. తొమ్మిది నెలల క్రితం నోటీసులు జారీ చేసినా.. కేంద్రం స్పందించలేదని సీజేఐ జస్టిస్​ ఎన్​వి. రమణ వ్యాఖ్యానించారు. సమాధానం ఇచ్చేందుకు మరింత సమయం ఇవ్వాలని సొలిసిటర్​ జనరల్​ తుషార్ మెహతా కోరారు. దానిపై స్పందించిన సీజేఐ.. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ ప్రారంభిస్తామని, తదుపరి వాయిదాలు కుదరదని స్పష్టం చేశారు.

cji
మంగళవారం మధ్యాహ్నం 2గం.ల నుంచి విచారణ ప్రారంభించనున్నట్లు సీజేఐ స్పష్టం చేశారు. తదుపరి వాయిదాలు కుదరదని స్పష్టం చేశారు.

By

Published : May 5, 2022, 12:22 PM IST

Updated : May 5, 2022, 12:35 PM IST

Sedition Law: దేశ ద్రోహ చట్టం 124ఏ రాజ్యాంగబద్ధతపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఇటీవల కేంద్రానికి జారీ చేసిన నోటీసులపై సమాధానం ఇవ్వడానికి సొలిసిటర్​ జనరల్(ఎస్​జీ) తుషార్‌ మెహతా.. న్యాయస్థానాన్ని సమయం కోరారు. పిటీషన్లన్నీ ఒకే బెంచ్‌ ముందుకు తెచ్చినా కేంద్రం స్పందించలేదని సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ వ్యాఖ్యానించారు. లాయర్ల స్థాయిలో సిద్ధమైనా అథారిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఎస్‌జీ తెలిపారు. దీంతో ఏం నిర్ణయం తీసుకున్నారు? అసలు నిర్ణయం తీసుకుంటారా? లేదా? అని సీజేఐ ప్రశ్నించారు. దీనిపై అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ అభిప్రాయాన్ని న్యాయస్థానం కోరింది.

"దేశ ద్రోహ చట్టం దుర్వినియోగం వ్యవహారంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు రూపొందించింది. ఇప్పుడు హనుమాన్ చాలీసా చదివినందుకు కూడా దేశ ద్రోహం కేసు నమోదు చేస్తున్నారు. ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం వెంటనే జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది."

- సీజేఐ ధర్మాసనం

దేశద్రోహం వ్యవహారంలో కేదార్​నాథ్ తీర్పుతో సంబంధం లేకుండా వాదనలు కొనసాగించవచ్చని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ చెప్పారు. 'వలసవాదులు వెళ్లిపోయారు.. ప్రస్తుతం మనల్ని మనమే పాలించుకుంటున్నామన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలని' సిబల్ అన్నారు.

లార్జర్ బెంచ్​కు పిటిషన్లు బదిలీ చేయాలో వద్దో.. లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని పిటిషనర్లకు, ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించింది. మంగళవారం మధ్యాహ్నం 2గం.ల నుంచి విచారణ ప్రారంభించనున్నట్లు సీజేఐ తెలిపారు. తదుపరి వాయిదాలు కుదరదని స్పష్టం చేశారు. సోమవారం ఉదయంలోపు ఇరువురూ తమ సమాధానాలు దాఖలు చేయాల్సిందేనని పేర్కొన్నారు. కేదార్​నాథ్ కేసుతో సంబంధం లేకుండానే లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని ప్రభుత్వానికి, పిటిషనర్లకు సూచించారు.

ఇదీ చదవండి:'ఆజాద్'​ సేన కోసం అంతా ఏకమై.. నల్లకోటుతో కోర్టుకు నెహ్రూ!

Last Updated : May 5, 2022, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details