శ్రీలంక నుంచి భారీ ఆయుధాలతో పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి అక్రమ చొరబాట్లు జరుగుతాయన్న కేంద్ర నిఘా సంస్థ హెచ్చరికలతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన కూడళ్లలో పోలీసు బలగాలను మోహరించి పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేసింది.
భారీ ఆయుధాలతో ఓ నౌక.. రామేశ్వరం వైపు వస్తోందని అధికారులకు సమాచారం అందింది. ఫలితంగా రాష్ట్రంలోని కన్యాకుమారి, తూత్తుకూడి, రామేశ్వరం, చెన్నైలోని తీర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.