తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సెక్యూరిటీ గార్డుల వరుస హత్యలు.. సీరియల్​ కిల్లర్​ హస్తం? - సెక్యూరిటీ గార్డుల హత్యలు

Security Guard Serial Killer : మధ్యప్రదేశ్​లో 72 గంటల వ్యవధిలోనే ముగ్గురు సెక్యూరిటీ గార్డులు హత్యకు గురవడం కలకలం రేపింది. వీరి హత్యలను పరిశీలిస్తే దీని వెనుక సీరియల్​ కిల్లర్​ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తరాఖండ్​ కాశీపుర్​లో జరిగిన మరో ఘటనలో తనను మోసం చేసిందని ప్రేయసి సహా ఆమె తల్లిని గొంతు కోసి హత్య చేశాడు ఓ వ్యక్తి.

Security Guard Serial Killer
Security Guard Serial Killer

By

Published : Sep 1, 2022, 8:08 PM IST

Security Guard Serial Killer : మధ్యప్రదేశ్​లో సెక్యూరిటీ గార్డుల హత్యలు కలకలం రేపుతున్నాయి. 72 గంటల వ్యవధిలోనే ముగ్గురు సెక్యూరిటీ గార్డులు హత్యకు గురయ్యారు. వీరి హత్యలను పరిశీలిస్తే దీని వెనుక సీరియల్​ కిల్లర్​ హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిలో ఇద్దరిని ఒకే వ్యక్తి హత్య చేసినట్లు భావిస్తున్నారు. అనుమానిత వ్యక్తి ఫొటోలను విడుదల చేశారు. పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని.. సెక్యూరిటీ గార్డులు సైతం జాగ్రత్తగా ఉండాలని హోం మంత్రి నరోత్తమ్​ మిశ్రా తెలిపారు.

ఆగస్టు 29న ఓ పరిశ్రమలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న కల్యాణ్ లోధి​ని (50) సుత్తెతో కొట్టి హత్య చేశారు. మరో ఘటనలో ఓ కళాశాల వద్ద పనిచేస్తున్న శాంబు నారాయణ్​ దూబే(60) అనే వ్యక్తిని అదే రోజు రాయితో కొట్టి చంపారు. మోతినగర్​లో జరిగిన మరో ఘటనలో మంగల్​ అహిర్వార్​ను కట్టెలతో దాడి చేసి చంపారు. లోధి, దూబెను చంపిన విధానాన్ని చూస్తే వీరిద్దరి హత్యలను ఒకే వ్యక్తి చేసినట్లు అనిపిస్తోందన్నారు ఏఎస్పీ విక్రమ్​ సింగ్​. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు. సీసీటీవీల ఆధారంగా విచారిస్తున్నామని.. నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు.

ప్రియురాలు మోసం చేసిందని.. ఆమెతో సహా తల్లి హత్య: ఉత్తరాఖండ్​ ఉద్దమ్​సింగ్ నగర్​లో దారుణం జరిగింది. ప్రేమ పేరుతో మోసం చేసిందని ప్రేయసితో సహా ఆమె తల్లిని గొంతు కోసి హత్య చేశాడు ఓ ప్రియుడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు.

కాశీపుర్​ మొహల్లా అలీ ఖాన్​ గ్రామానికి చెందిన షబానా తన కుమార్తె షీబాతో కలిసి జీవిస్తోంది. ఆమె భర్త, కుమారుడు గల్ఫ్​లో పనిచేస్తున్నారు. కాశీపుర్​కు చెందిన సల్మాన్​ సౌదీ అరేబియాలో పనిచేసి తిరిగి వచ్చాడు. సల్మాన్​.. షీబాతో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడు​. అయితే, షీబా మోసం చేయడం వల్ల ఆగ్రహించిన సల్మాన్​.. ఆమెను హత్య చేయాలని అనుకున్నాడు. దీంతో ఆమెను వెంబడించిన సల్మాన్​.. గొంతు కోశాడు. అనంతరం ఆమె ఇంటికి వెళ్లి షీబా తల్లిని సైతం గొంతు కోసి హత్య చేశాడు.

ఉరివేసుకుని ఎంబీబీఎస్​ విద్యార్థి ఆత్మహత్య :ఎంబీబీఎస్​ చివరి సంవత్సర విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన దిల్లీలో జరిగింది. హాస్టల్​ గదిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మానసిక ఒత్తిడి భరించలేకే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతురాలి డైరీలో సూసైడ్​ నోట్​ లభ్యమైందని చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ముక్కలు, ముక్కలుగా చేసి బ్యాగులో పెట్టి: ఝార్ఖండ్​ దేవ్​గఢ్​​లో దారుణం జరిగింది. ఓ చిన్నారి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి బ్యాగులో పెట్టి పొదల్లో పడేశారు. మోహన్​పుర్​ పోలీస్ స్టేషన్​ పరిధిలోని హిండోలావరన్​-కుండా బైపాస్​ రోడ్డుపై ఈ ఘటన జరిగింది. ఈ మృతదేహాన్ని 12-15 ఏళ్ల వయసున్న అబ్బాయిగా గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బ్యాగులో తల లభించలదేని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

వృద్ధురాలిపై హత్యాచారం: 55 ఏళ్ల వృద్ధురాలిపై హత్యాచారం చేసిన ఘటన లద్దాఖ్​​ లేహ్​లో జరిగింది. అచింతనాగ్​కు చెందిన రిగ్జిన్ దావా(32) అనే వ్యక్తి 55 ఏళ్ల వృద్ధురాలిపై బుధవారం అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను హత్య చేసి పరారయ్యాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హత్యాచారం జరిగిన మూడు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు.

బాలుడిని హత్య చేసిన పనిమనిషి: దిల్లీలో దారుణం జరిగింది. అంగవైకల్యం ఉన్న బాలుడిని హత్య చేశాడు ఇంటి పనిమనిషి. ఈ ఘటన దక్షిణ దిల్లీలోని సఫ్దార్​జంగ్​లో జరిగింది. బుధవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు గుడికి వెళ్లేటప్పడు.. బాలుడిని పనిమనిషి దగ్గర విడిచిపెట్టారు. తిరిగి వచ్చేసరికి బాలుడు బెడ్​పై శవమై కనిపించాడు. పనిమనిషి కనిపించకపోవడం వల్ల ఇంట్లో తనిఖీ చేయగా.. విలువైన వస్తువులు, ఆభరణాలు, రూ. 40వేల నగదు మాయమైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుడిని పట్టుకునేందుకు ఆరు బృందాలను ఏర్పాటు చేశారు.

నవజాత శిశువు దారుణ హత్య: మధ్యప్రదేశ్​ జబల్​పుర్​ దారుణం జరిగింది. నవజాత శిశువును హత్య చేసి తల, చేయి వేరు చేసి మార్కెట్​లో వదిలి వెళ్లారు. సుభాశ్ చంద్రబోస్​ ప్రభుత్వ వైద్య కళాశాల సమీపంలో ఈ ఘటన జరిగింది. మృతదేహాన్ని ఓ బ్యాగులో పెట్టి వదిలివెళ్లగా కార్మికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చదవండి:చెవి నొప్పితో వెళితే చేయి కట్​.. మూడు నెలల్లో జరగాల్సిన పెళ్లి రద్దు

పడవలో పాము.. వణికిపోయిన ప్రజలు.. నీటిలో మునిగి ఆరుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details