సెంట్రల్ రిజర్వ్ పోలీస్ దళాలు (సీఆర్పీఎఫ్), స్థానిక పోలీసులు సంయుక్తంగా.. ఝార్ఖండ్లో భారీ పేలుడు కుట్రను భగ్నం చేశారు. బుధవారం ఉదయం 15కిలో ఐఈడీని స్వాధీనం చేసుకోవడం ద్వారా పెను దాడిని అడ్డుకోగలిగారు.
ఆపరేషన్ ఇలా..
నిఘా వర్గాల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం మేరకు.. సీఆర్పీఎఫ్ 154 బెటాలియన్ దళం సభ్యులు, ఝార్ఖండ్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.
అనుమానిత సీతూ ప్రాంతాంతో అణువణువూ పరిశీలించారు. ఈ గాలింపులో మక్కాన్-చేచారియ మధ్య ఉన్న ఓ కల్వర్టు వద్ద 15 కిలోల శక్తిమంతమైన ఐఈడీ ఉన్నట్లు గుర్తించారు. బాంబ్ స్క్వాడ్ సాయంతో దానిని నిర్వీర్యం చేసి స్వాధీనం చేసుకున్నట్లు సీఆర్పీఎఫ్ ఓ ప్రకటనలో తెలిపింది.
భద్రతా దళాలే లక్ష్యంగా మావోయిస్టులు ఈ పేలుడుకు కుట్ర పన్నినట్లు నిఘా వర్గాలు స్పష్టమైన సమాచారాన్ని ఇచ్చాయని వెల్లడించింది సీఆర్పీఎఫ్.
ఇదీ చదవండి:'సూపర్ కాప్' అవ్వాలని.. అంబానీ నుంచి డబ్బు లాగాలని..