తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చైనా, పాక్​ సరిహద్దుల్లో పరిస్థితులపై ఆర్మీ ఉన్నతాధికారుల చర్చ

Security Along China, Pakistan: చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లో పరిస్థితులపై ఆర్మీ ఉన్నతాధికారులు చర్చ జరిపారు. దిల్లీ వేదికగా ఆర్మీ ఛీఫ్​ ఎమ్ ఎమ్ నరవాణే ఆధ్వర్యంలో ఈ ఆర్మీ కమాండర్స్​ చర్చలు జరగుతున్నాయి.

mm naravane
ఎమ్ ఎమ్ నరవాణే

By

Published : Dec 24, 2021, 5:57 AM IST

Security Along China, Pakistan: హెలికాప్టర్ ప్రమాద ఘటనలో త్రిదళాధిపతి బిపిన్​ రావత్​ మరణానంతరం తొలిసారిగా ఆర్మీ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. చైనా, పాకిస్థాన్​ సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులపై చర్చించారు. ఆర్మీ ఛీఫ్​ మనోజ్​ ముకుంద్ నరవాణే ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరగనున్న ఈ చర్చలు.. దిల్లీ వేదికగా గురువారం ప్రారంభమయ్యాయి.

"చైనా, పాకిస్థాన్ సరిహద్దుల్లోని పరిస్థితులు, జమ్ము కశ్మీర్​లో పరిస్థితిపై ఆర్మీ కమాండర్స్ చర్చ జరిపారు." అని ఓ ప్రభుత్వ అధికారి తెలిపారు.

తూర్పు లద్ధాఖ్​లో గల్వాన్ హింసాత్మక ఘటన అనంతరం భారత్​, చైనా సరిహద్దుల మధ్య ప్రతిష్టంభన నెలకొంది. గతేడాది ఏప్రిల్-మే సమయంలో ఇరు దేశాలు భారీ సంఖ్యలో సరిహద్దుల వద్దకు తమ సైన్యాన్ని మొహరించాయి. కొన్ని నెలల తర్వాత బలగాల ఉపసంహరణ దిశగా అడుగులేశాయి. ఈ నేపథ్యంలో ఆర్మీ కమాండర్స్​.. చైనా దుందుడుకు చర్యలపై చర్చించారు.

సీడీఎస్​ బిపిన్ రావత్ డిసెంబర్ 8న హెలికాప్టర్ క్రాష్​లో మరణించారు. ఈ ఘటనలో ఆయన సతీమణి సహా మరో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.

ABOUT THE AUTHOR

...view details