ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపుర్ వద్ద శనివారం ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఓ కోబ్రా కమాండోను అపహరించినట్లు నక్సల్స్ చేసిన ప్రకటనలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు భద్రతా సంస్థలు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. కిడ్నాపైనట్లు భావిస్తున్న జవాను 210 కోబ్రా బెటాలియన్‌కు చెందిన రాకేశ్వర్ సింగ్ మిన్హాస్గా అధికారులు గుర్తించారు. అయితే ఈ అపహరణపై స్పష్టత ఇవ్వలేమని పేర్కొన్నారు. రాకేశ్వర్‌ను కిడ్నాప్ చేశామని మావోయిస్టులు ఆదివారం సాయంత్రం స్థానిక జర్నలిస్టుకు సమాచారం అందించారు.
"కమాండో రాకేశ్వర్ సింగ్ మిన్హాస్ ఆచూకీని ఇంకా కనుగొనలేదు. అయితే ఇది నక్సల్స్ పనేనని కచ్చితంగా చెప్పడానికి తగిన ఆధారాలు మా వద్ద లేవు. దీనిపై దర్యాప్తు చేపడుతున్నాము. రాకేశ్వర్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాము"
-సీనియర్ అధికారి
జమ్ము కశ్మీర్‌కు చెందిన రాకేశ్వర్ విడుదలపై సమయం చూసి చర్చించాలని నక్సల్స్ భావిస్తున్నట్లు సమాచారం.
బృందాలతో గాలింపు..