ఆర్థిక రాజధాని ముంబయిలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. డిసెంబర్ 2 నుంచి జనవరి 2 వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. నగరవ్యాప్తంగా ఐదుగురికి మించి గుమికూడడం, నిరసనలు, ప్రచారాలు చేయడాన్ని నిషేధించారు. ఊరేగింపులు, లౌడ్స్పీకర్లు ఏర్పాటు చేయడంపై నిషేధం విధించామని నగర డిప్యూటీ కమిషనర్ విశాల్ ఠాకూర్ వెల్లడించారు.
అనుమతి లేనివి
- ఐదుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది గుమికూడడం
- ఊరేగింపులు
- లౌడ్స్పీకర్స్ పెట్టడం
- బాణాసంచా కాల్చడం
వేటికి అనుమతి ఉంది?
- వివాహ సంబంధిత కార్యక్రమాలు
- అంత్యక్రియలు
- న్యాయ సంబంధ సమావేశాలు, కో ఆపరేటివ్ సోసైటీలు
- వాణిజ్య సంబంధ అసోసియేషన్ సమావేశాలు
- సినిమాలు, వినోద కార్యక్రమాలు
- ప్రభుత్వ, స్థానిక సంస్థల కార్యకలపాలు
- పాఠశాలలు, కళాశాలలు, అన్ని రకాల విద్యా సంస్థలు
- పారిశ్రామిక కార్యకలపాలు, వాణిజ్య సంస్థలు
ఇవీ చదవండి:ఇస్రో గూఢచర్యం కేసులో సుప్రీం కీలక తీర్పు.. నలుగురు పోలీసుల బెయిల్ రద్దు
ఆడపిల్లగా పుట్టడమే పాపం.. 9 నెలల చిన్నారిని చంపిన తండ్రి.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి తల్లి..