SECOND WIFE MURDER: మూడో భార్యతో కలిసి రెండో భార్యను హత్య చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల సగం కాలిన శవాన్ని గుర్తించిన పోలీసులు.. దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. మూడో భార్యతో కలిసి ఈ ఘటనకు పాల్పడినట్లు తేల్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్‌లో ఈ ఘటన జరిగింది.
Chhattisgarh Second wife killing news: నిందితుడు తులసీదాస్ మానిక్పురి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. 2009లో తొలిసారి వివాహం చేసుకొని.. ఆ తర్వాత విడిపోయాడు. 2014లో మరోసారి పెళ్లి చేసుకున్నాడు. ఇక 2021లో ఇంద్రాణి అనే మహిళతో ప్రేమలో పడ్డాడు. రెండో భార్యకు విడాకులు ఇవ్వకుండానే ప్రేయసిని వివాహమాడాడు. పెళ్లి తర్వాత రెండో భార్యతో వివాదాలు తలెత్తాయి. దీంతో ఆమెను వదిలించుకోవాలని భావించి.. మూడో భార్యతో కలిసి పథకం ప్రకారం హత్య చేశాడు.