తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'40 ఏళ్లు పైబడిన వారిపై వైరస్​ ప్రభావం అధికం'​ - ఐసీఎంఆర్

గత ఏడాది వచ్చిన కరోనా వైరస్​తో పోల్చితే.. ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా సెకండ్​ వేవ్​కు తీవ్రత తక్కువని తెలిపారు ఇండియన్ కౌన్సిల్​ ఆఫ్ మెడికల్​ రీసెర్చ్( ఐసీఎంఆర్) డైరెక్టర్​ జనరల్​ డాక్టర్ బలరాం భార్గవ. ప్రస్తుతం వైరస్ బారిన పడ్డ వారిలో లక్షణాలు తక్కువగా కనిపిస్తున్నాయన్నారు. అయితే.. శ్వాస తీసుకోవటంపై సెకండ్​ వేవ్ అధిక ప్రభావం చూపుతోందని స్పష్టం చేశారు. 40 ఏళ్లు పైబడిన వారిపైనే అధిక ప్రభావం చూపుతున్నట్లు చెప్పారు.

corona second wave
ఐసీఎంఆర్ డైరెక్టర్​ జనరల్​ డాక్టర్. బలరాం భార్గవ

By

Published : Apr 19, 2021, 5:11 PM IST

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్​ వేవ్​ కోరలు చాస్తోన్న క్రమంలో వైరస్​పై ఇండియన్ కౌన్సిల్​ ఆఫ్ మెడికల్​ రీసెర్చ్( ఐసీఎంఆర్)​ డైరెక్టర్ జనరల్ డాక్టర్. బలరాం భార్గవ కీలక వ్యాఖ్యలు చేశారు. గత కరోనా వైరస్​తో పోల్చితే.. సెకండ్​ వేవ్ తీవ్రత తక్కువేనని స్పష్టం చేశారు. వైరస్​ వచ్చిన వారిలో లక్షణాలు తక్కువగా కనబడుతున్నాయన్నారు.

" కరోనా బారిన పడుతున్న వారిలో 70 శాతం మంది 40 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసువారే ఉన్నారు. ఈ సంవత్సరం చాలా మంది లక్షణాలు లేకుండానే ఆసుపత్రులకు వస్తున్నారు. ఎక్కువశాతం శ్వాస సంబంధిత సమస్యలతోనే వస్తున్నారు. కరోనా మొదటి దశ, రెండో దశలో మరణాల రేటులో మాత్రం తేడా లేదు."

-- డాక్టర్. బలరాం భార్గవ, ఐసీఎంఆర్​ డైరెక్టర్ జనరల్

భారత్​లో 'డబుల్ మ్యూటెంట్​' వ్యాప్తి ఆధారాలు లేవన్నారు బలరాం. మూడు ప్రధాన వేరియంట్లు అయిన యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్​.. రకం వైరస్​లు దేశంలోకి ఇప్పటికే వచ్చాయని పేర్కొన్నారు. మెుదటి వేవ్‌లో41.5శాతం కరోనా బాధితులకు ఆక్సిజన్‌ అవసరమైందన్న ఐసీఎంఆర్​ప్రస్తుతం54.5శాతం మందికి ప్రాణవాయువు అవసరంఏర్పడినట్లు చెప్పింది. మరోవైపు గతంతో పోలిస్తే లక్షణాలు లేని రోగుల శాతం ఈ సారిఅధికంగా ఉన్నట్లు తెలిపింది. గతంలో30ఏళ్లు లోపున్న వారు31శాతం మంది కరోనా బారిన పడితే..... ఈ దఫా అది32శాతంగాఉన్నట్లు ఐసీఎంఆర్‌ చెప్పింది.

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సోమవారం ఒక్కరోజే 2.73 లక్షల కేసులు నమోదయ్యాయి. వైరస్​ ధాటికి 1,619 మంది మరణించారు. దీంతో భారత్​లో మొత్తం కేసుల సంఖ్య కోటీ 50 లక్షల 61వేలు దాటాయి.

ఇదీ చదవండి :ఫార్మా సంస్థలు, ప్రముఖ వైద్యులతో మోదీ భేటీ

ABOUT THE AUTHOR

...view details