బంగాల్-అసోంలో రెండో విడత పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. అప్పటి నుంచే ఓటర్లు భారీ సంఖ్యల్లో అనేక పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరుతున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు.. యువకుల నుంచి వృద్ధుల వరకు క్యూలో నిలబడి ఎదురుచూస్తున్నారు.
అసోంలో పోలింగ్ కేంద్రం వద్ద ఎదురు చూస్తున్నఓటర్లు కొవిడ్ నిబంధనలు- పటిష్ఠ భద్రతా ఏర్పాట్ల మధ్య పోలింగ్ జరుగుతోంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు ముమ్మరం చేశారు.
అయితే.. అసోం నగాన్లోని 26వ పోలింగ్ కేంద్రం, సిల్చాన్లోని 146వ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు మొరాయించగా పోలింగ్ ఆలస్యమైంది.
బంగాల్ నందిగ్రామ్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న వృద్ధులు ప్రధాని ట్వీట్..
రెండో విడత పోలింగ్ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. అసోంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. బంగాల్ ప్రజలు రికార్డు స్థాయిలో ఓట్లు వేయాలని కోరారు.
నందిగ్రామ్‌లో సువేందు..
బంగాల్లో నందిగ్రామ్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి సువేందు అధికారి.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందనాయకర్ ప్రాథమిక పాఠశాలలో 76వ పోలింగ్ బూత్‌లో ఆయన ఓటు వేశారు.
నందిగ్రామ్‌లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరిన ఓటర్లు
నందిగ్రామ్‌లో ఓటర్ల భారీ క్యూ
అసోంలో 39, బంగాల్లో 30 అసెంబ్లీ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.