కరోనా టీకా తొలి డోసు తీసుకుని.. రెండో డోసు తీసుకోని వారు దాదాపు 11కోట్ల మంది ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. వీరంతా సమయం దాటిపోయినా టీకా తీసుకోవడం లేదని తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల ఆరోగ్య కార్యదర్శులతో జరిగిన సమావేశంలో కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ విషయంపై చర్చించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వీరందరికీ టీకాలు ఇచ్చేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించినట్లు పేర్కొన్నాయి.
దేశంలో కరోనా టీకాకు అర్హులైన 94 కోట్ల మందిలో 76 శాతం మంది కనీసం ఒక్క డోసు టీకా వేసుకున్నారు. 32 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయి.