తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బంగాల్​లో కాంగ్రెస్-లెఫ్ట్ సీట్ల పంపకాలు పూర్తి - bengal elections news

బంగాల్​లో కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి మధ్య సీట్ల పంపకం పూర్తయింది. వామపక్షాలు 165, కాంగ్రెస్ 92 స్థానాల్లో బరిలోకి దిగుతుండగా.. కూటమిలో చేరిన అబ్బాస్ సిద్ధిఖీ నేతృత్వంలోని ఐఎస్​ఎల్ పార్టీ 37 స్థానాలను దక్కించుకుంది.

seat-sharing-pact-finalized-left-front-at-165-congress-at-92-and-isf-at-37
బంగాల్​లో వామపక్షాల సీట్ల పంపకం ఖరారు

By

Published : Mar 4, 2021, 7:02 PM IST

బంగాల్​లో కాంగ్రెస్-ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్(ఐఎస్ఎల్)​-వామపక్షాల కూటమి మధ్య సీట్ల పంపకం ఎట్టకేలకు తేలిపోయింది. మూడు పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం 165 స్థానాల్లో వామపక్షాలు, 92 స్థానాల్లో కాంగ్రెస్, 37 స్థానాల్లో ఐఎస్ఎల్ పోటీకి దిగనున్నాయి.

వామపక్ష కూటమికి కేటాయించిన 165 స్థానాల్లో సీపీఎం 130 సీట్లలో బరిలోకి దిగనుంది. తొమ్మిది స్థానాల్లో సీపీఐ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ 15, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ 11 స్థానాల నుంచి పోటీ చేయనుంది. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మార్చి 8న ప్రకటించనుంది.

తొలుత 45 సీట్ల కోసం ఐఎస్ఎఫ్ అధ్యక్షుడు అబ్బాస్ సిద్ధిఖీ పట్టుబట్టినప్పటికీ.. చివరకు 37 స్థానాలు దక్కాయి. ఈ స్థానాలన్నీ వామపక్షాలు తమ కోటా నుంచి ఇచ్చాయి.

కాంగ్రెస్ సహా వామపక్ష కూటమిలోని పార్టీలు తన స్థానాలను వదులుకునేందుకు సిద్ధంగా లేని నేపథ్యంలో.. సీట్ల పంపకంపై తొలుత అవాంతరాలు ఎదురయ్యాయని సీపీఎం సెంట్రల్ కమిటీ సభ్యుడు ఒకరు తెలిపారు. కానీ చివరకు ఒప్పందం కుదిరిందని చెప్పారు. ఇకపై ఐక్యమత్యంగా ప్రచారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి:మిఠాయి దుకాణాల్లో బంగాల్ రాజకీయం!

ABOUT THE AUTHOR

...view details