SCR Recruitment 2023 : రైల్వేలో పనిచేయాలనే ఆస్తకి ఉన్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. దక్షిణ మధ్య రైల్వే 35 జూనియర్ టెక్నికల్ అసోసియేట్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2023 జూన్ 30.
పోస్టుల వివరాలు
- సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లో.. జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (వర్క్స్) - 19 పోస్టులు
- ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్లో.. జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (డ్రాయింగ్) - 10 పోస్టులు
- ఎస్ అండ్ టీ డిపార్ట్మెంట్లో.. జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (డ్రాయింగ్) - 06 పోస్టులు
విద్యార్హతలు
- Railway Jobs Notification 2023 : జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (వర్క్స్) - అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 4 సంవత్సరాల వ్యవధి గల సివిల్ ఇంజినీరింగ్ లేదా సివిల్ ఇంజినీరింగ్‌కు సంబంధించిన సబ్స్ట్రీమ్స్ కాంబినేషన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి.
- జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (ఎలక్ట్రికల్) (డ్రాయింగ్) - అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి నాలుగేళ్ల వ్యవధి గల మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 3 ఏళ్ల వ్యవధి గల మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా చేసి ఉండాలి.
- జూనియర్ టెక్నికల్ అసోసియేట్ ఎస్ & టీ (డ్రాయింగ్) - అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కమ్యునికేషన్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ లేదా ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్‌లో నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదా అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ కమ్యునికేషన్ ఇంజినీరింగ్/ కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్ లేదా ఎమ్మెస్సీ ఎలక్ట్రానిక్స్‌లో మూడేళ్లు వ్యవధి గల డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి
- యూఆర్ - 18 నుంచి 33 ఏళ్లు
- ఓబీసీ - 18 నుంచి 36 ఏళ్లు
- ఎస్సీ/ ఎస్టీ - 18 నుంచి 38 ఏళ్లు