బిహార్ బక్సార్ జిల్లా సమీపంలోని గంగానదిలో వందల సంఖ్యలో కుళ్లిన మృతదేహాలు తేలటం కలకలం రేపింది. బక్సార్లోని మహదేవ్ ఘాట్ వద్ద కుళ్లిన మృతదేహాలను కుక్కలు పీక్కుతింటున్న దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనపై బక్సార్ జిల్లా కలెక్టర్ పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.
" ఇది అతిపెద్ద విషాదం. ఉత్తర్ ప్రదేశ్కు చెందిన బీర్పుర్, బరేగామ్ గ్రామాలు గంగానది ఒడ్డున ఉన్నాయి. 400 నుంచి 500 మృతదేహాలు కుళ్లిన స్థితిలో బక్సార్లోని మహాదేవ్ ఘాట్ వద్దకు కొట్టుకొచ్చినట్లు స్థానిక గ్రామస్థులు తెలిపారు. కానీ సీఈఓ, నా బృందం 40 నుంచి 50 మృతదేహాలను ఇక్కడ చూశాం. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తాం."
-- అశోక్ కుమార్, చౌసా బీడీఓ
" ఈ మృతదేహాలు గత 5-7 రోజుల నుంచి నీటిలో తేలియాడుతున్నట్లుగా ఉంది. మృతదేహాలను నదిలో పడేసే ఆచారం మనకు లేదు. వీటిని ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ మృతదేహాలు వారణాసి, అలహాబాద్ లేదా ఇతర ప్రాంతాల నుంచి కొట్టుకొచ్చాయా? అనే విషయంపై దర్యాప్తు చేపట్టాం. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా ఘాట్ వద్ద అధికారులను అప్రమత్తం చేశాం."