తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​కు చేరుకున్న పాక్​ మంత్రి భుట్టో.. పుష్కర కాలంలో తొలిసారి.. సలాం ఇండియా అంటూ.. - షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గోవా

SCO Meeting Goa 2023 : షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమిట్​లో భాగంగా పాకిస్థాన్​ విదేశాంగ మంత్రి బిలావల్​ భుట్టో గోవా జర్దారీ చేరుకున్నారు. రెండు రోజులు జరగనున్న ఎస్‌సీఓ విదేశాంగ మంత్రుల సమావేశాల్లో ఆయన పాల్గొంటారు.

sco meeting goa 2023
sco meeting goa 2023

By

Published : May 4, 2023, 9:40 PM IST

SCO Meeting Goa 2023 : షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్‌సీఓ) సమావేశం‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ గురువారం గోవా చేరుకున్నారు. ఎస్​సీఓ కౌన్సిల్​ ఆఫ్​ ఫారిన్​ మినిస్టర్స్​ సమావేశంలో పాల్గొననున్నారు. 2011 తర్వాత భారత్‌లో పర్యటిస్తున్న తొలి పాకిస్థాన్ విదేశాంగ మంత్రిగా బిలావల్ నిలిచారు. సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం సహా అనే అంశాల్లో పాక్​పై భారత్​ గుర్రుగా ఉంది. ఈ నేపథ్యంలో భుట్టో భారత్​ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, భారత విదేశాంగ మంత్రి ఎస్​ జైంకర్, భుట్టో మధ్య ఎలాంటి ద్వైపాక్షిక సమావేశాలు లేవని తెలుస్తోంది. పాక్​ నుంచి కూడా ఎలాంటి అభ్యర్థనలు రాలేవని సమాచారం.

"షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌లో పాల్గొనడం కోసం గోవాకు వచ్చినందుకు సంతోషంగా ఉన్నాను. ఎస్​సీఓలో పాకిస్థాన్ ప్రతినిధి బృందానికి నేను నాయకత్వం వహిస్తున్నాను. ఎస్​సీఓ చార్టర్ పట్ల పాకిస్థాన్​కు ఉన్న బలమైన నిబద్ధత వల్లే ఈ సమావేశానికి హాజరు కావాలనే నిర్ణయం తీసుకున్నాం. ఎస్​సీఓ విదేశాంగ మంత్రుల మండలి (సీఎఫ్​ఎమ్​) విజయవంతమవుతుందని ఆశిస్తున్నాను. ఈ సమిట్​లో నా సహచర విదేశాంగ మంత్రులతో సమావేశాలు నిర్వహిస్తాను."
-బిలావల్​ భుట్టో జార్దారీ, పాకిస్థాన్​ విదేశాంగ మంత్రి

సలాం ఇండియా..: భుట్టో
SCO Summit 2023 Bilawal Bhutto statement : భారత్​కు విచ్చేసిన అనంతరం ఓ వీడియోను ట్వీట్ చేసిన బిలావల్.. గోవా నుంచి భారత్​కు సలాం అంటూ పేర్కొన్నారు. తొలుత తాను మొదట రష్యా విదేశాంగ మంత్రితో సమావేశమవుతానని తెలిపారు. తర్వాత ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొననున్నట్లు వెల్లడించారు.

మాండరిన్​ బదులు ఇంగ్లీష్​.. ఇండియా డిమాండ్​
ఎస్​సీఓ అధికారిక భాషగా ఉన్న మాండరిన్​, రష్యన్​ భాషల బదులు.. ఇంగ్లీష్​ను ఉపయోగించాలని ఈ సమావేశాల్లో భారత్​ పట్టుబట్టే అవకాశం ఉంది. ఎస్​సీఓలో ఉన్న మరికొన్ని దేశాలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమిట్​కు సంబంధించిన దస్త్రాలు అన్ని ఈ రెండు భాషల్లోనే ప్రిపేర్​ చేస్తారు. రష్యా, చైనా కాకుండా ఈ రెండు భాషలను గ్రూప్​లో ఉన్న మరో నాలుగు దేశాలు విరివిగా ఉపయోగిస్తాయి. ఇక్కడ తీసుకున్న నిర్ణయాలకు జులైలో దిల్లీలో జరగనున్న ఎస్​సీఓ శిఖరాగ్ర సదస్సులో ఆమోదం తెలపనున్నారు.

'సెక్యూర్-SCO' అనే ఇతివృత్తంతో భారత్​ ఈ సమావేశాలను నిర్వహిస్తోంది. ఎస్​సీఓలో ఉన్న దేశాల్లో బహుపాక్షిక, రాజకీయ, భద్రత, ఆర్థిక, ప్రజల మధ్య పరస్పర చర్యలను ప్రోత్సహించడానికి భారత్​ ప్రాధాన్యత ఇస్తోంది. ఎస్​సీఓ చివరి సమావేశం ఉజ్బెకిస్థాన్‌లోని సమర్‌ఖండ్‌లో జరిగింది.
ప్రస్తుతం ఎస్​సీఓలో ఇండియా, పాకిస్థాన్​, చెనా, రష్యా, కజక్​స్థాన్​, కిర్గిస్థాన్​, తజకిస్థాన్​, ఉజ్బెకిస్థాన్​ ఉన్నాయి. ఎస్​సీఓ ప్రధాన కార్యాలయం బీజింగ్​లో ఉంది. భారత్​ 2017లో ఎస్​సీఓలో జాయిన్​ అయింది. అప్పటి నుంచి ఇండియా ఈ సమిట్​కు అధ్యక్షత వహించడం ఇదే తొలిసారి.

ABOUT THE AUTHOR

...view details