ప్రపంచంలోనే నల్లపులులు (black tiger) కనిపించే ఏకైక ప్రదేశం.. ఒడిశాలోని సిమిలాపాల్ (Black tigers Odisha). అక్కడి పులులు.. రాయల్ బెంగాల్ పులుల కంటే భిన్నంగా కనిపిస్తాయి. వీటి శరీరంపై నల్లటి చారలు దట్టంగా పరచుకొని ఉంటాయి. ఒక్కోసారి పూర్తి నలుపు వర్ణంలోనూ కనిపిస్తాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా వీటిపై ఆకర్షణ పెరిగింది. ఇవి ఎందుకు నలుపు వర్ణంలో ఉంటాయి? దాని వెనుక కారణమేమిటి? అన్న అంశంపై చాలా పరిశోధనలు జరిగాయి. ఎట్టకేలకు ఈ రహస్యాన్ని బెంగళూరు శాస్త్రవేత్తలు ఛేదించారు. 'ట్రాన్స్‌మెంబ్రెన్ అమినోపెప్టిడేస్ క్యూ' అనే జన్యువు ఉత్పరివర్తనం (Genetic mutation) కారణంగా ఈ పులులకు నలుపు రంగు వచ్చినట్లు కనుగొన్నారు.
black tiger: వీడిన నల్లపులి రంగు రహస్యం - సిమిలాపాల్ టైగర్ రిజర్వ్
ప్రపంచంలోనే నలుపు రంగు పులులు (black tiger) కనిపించే ఒకే ఒక ప్రాంతం ఒడిశాలోని సిమిలాపాల్. వాటి రంగు వెనకాల రహస్యం కనుగొనడానికి ఏళ్లుగా పరిశోధనలు జరిగాయి. ఎట్టకేలకు ఆ రహస్యాన్ని ఛేదించారు బెంగళూరు శాస్త్రవేత్తలు.

సిమిలాపాల్ టైగర్లు.. ఇతర జాతుల పులులతో సంపర్కం జరపవని, అందుకే ఇవి అంతరించే పోయే ప్రమాదం అధికంగా ఉందని ఈ పరిశోధన పేర్కొంది. 2018 లెక్కల ప్రకారం భారత్‌లో 2,967 పులులు (Tiger Census) ఉన్నాయి. సిమిలాపాల్‌లో (Shmlipal tiger reserve) తీసిన ఫొటోల ఆధారంగా కేవలం 8 నల్ల పులులు మాత్రమే ఉన్నాయని తేలింది. బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్(ఎన్సీబీఎస్) శాస్త్రవేత్తలు దేశంలోని ఇతర పరిశోధన సంస్థలతో కలిసి ఈ అధ్యయనం చేశారు. వీరి పరిశోధన పత్రాన్ని నేషనల్ అకడమిక్ ఆఫ్ సైన్సెస్ ప్రచురించింది.
ఇదీ చూడండి:వన్యమృగ సంరక్షణ బాధ్యత మనిషిదే