ఐదు కోట్ల ఇరవై లక్షల సంవత్సరాల క్రితం నాటి చీమల శిలాజాన్ని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. జమ్ము కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఉన్న హేమవతి నందన్ గడ్వాల్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనతను సాధించారు. రాజస్థాన్‌లోని బీకానెర్ ప్రాంతలోని ఓ గనిలో వీటిని గుర్తించిట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. లార్వా రూపంలో ఈ శిలాజం లభించిందని శాస్త్రవేత్తలు తెలిపారు. లార్వా రూపంలో ఉన్న చీమల శిలాజాన్ని కనుగొనడం ప్రపంచంలోనే మొదటిసారని వారు చెబుతున్నారు. ఇది అత్యంత పూరాతనమైన లార్వా అని శాస్త్రవేత్తలు అంటున్నారు. ప్రస్తుతం ఈ చీమల శిలాజంపై మరింత లోతుగా పరిశోధనలు జరుపుతున్నట్లు వారు వెల్లడించారు. భవిష్యత్తులో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు.. ఈ శిలాజం దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
"యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ రాజేంద్ర రాణా అధ్వర్యంలో ఈ పరిశోధన జరుగుతోంది. బీకానెర్లోని బ్రౌన్ మైన్స్‌లో ఈ చీమల లార్వాను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం రష్యా శాస్త్రవేత్తల సహాయం సైతం తీసుకున్నారు. 2ఎమ్ఎమ్ పరిణామంలో ఈ లార్వా ఉంది. ఒక లార్వాను నీటిలో గుర్తించారు. ఇంతకు ముందెన్నడు నీటిలో ఓ శిలాజాన్ని గుర్తించలేదు" అని గడ్వాల్ యూనివర్సిటీలోని పీఎచ్డీ స్కాలర్ రమణ పటేల్ తెలిపారు.