తెలంగాణ

telangana

ETV Bharat / bharat

స్కూల్స్​ రీఓపెన్​కు కేంద్రం సన్నాహాలు.. నమూనాపై కసరత్తు - పాఠశాలల పునఃప్రారంభం

Schools reopening: కరోనా కారణంగా ఆన్​లైన్​ తరగతులకే పరిమితమైన పాఠశాలలను తెరిచేందుకు సన్నద్ధమవుతోంది కేంద్రం. కొవిడ్​-19 మార్గదర్శకాలు పాటిస్తూ.. భౌతిక తరగతులు నిర్వహించేలా దఫాలవారీగా పాఠశాలలు ప్రారంభించే విధానంపై కసరత్తు చేస్తోంది.

opening of schools
పాఠశాలల్లో భౌతిక తరగతులు

By

Published : Jan 27, 2022, 7:31 PM IST

Schools reopening: కొవిడ్​-19 మార్గదర్శకాలు పాటిస్తూ భౌతిక తరగతులు నిర్వహించేలా.. దశలవారీగా పాఠశాలలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది కేంద్ర ప్రభుత్వం. పాఠశాలల పునఃప్రారంభానికి ఓ నమూనాను తయారు చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.

ఒమిక్రాన్​ వేరియంట్​ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో భౌతిక తరగతులు మూతపడ్డాయి. విద్యార్థులు ఆన్​లైన్​ క్లాసులకే హాజరవుతున్నారు. దేశంలో దాదాపు రెండేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది.

" పాఠశాలలు తెరవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్​ చేస్తున్న క్రమంలో.. కొవిడ్​ మార్గదర్శకాలు పాటిస్తూ భౌతిక తరగతులు నిర్వహించేలా.. దఫాలవారీగా పాఠశాలలు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ నమూనాను సిద్ధం చేస్తోంది."

- ప్రభుత్వ ఉన్నతాధికారి.

విద్యార్థుల తల్లిదండ్రుల తరఫున ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు చంద్రకాంత్​ లహారియా, పాలసీ రీసెర్చ్​ కేంద్రం అధ్యక్షురాలు యామిని అయ్యర్​.. బుధవారం దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియాను కలిశారు. 1,600 మంది తల్లిదండ్రులు సంతకాలు చేసిన మెమోరండం అందించారు. పాఠశాలలు తెరవాలని డిమాండ్​ చేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి డిమాండ్లే వస్తున్నాయి. అయితే.. మరికొంత మంది ఆన్​లైన్​ తరగతులను కొనసాగించాలని కోరుతున్నారు.

దేశ రాజధానిలో పాఠశాలలను తెరవాలని దిల్లీ ప్రభుత్వం సూచించింది. అయితే, ఈ అంశంపై చర్చించేందుకు దిల్లీ విపత్తు నిర్వాహణ సంస్థ గురువారం సమావేశం కానుంది. ఆ తర్వాతే పాఠశాలల పునఃప్రారంభంపై నిర్ణయం వెలువడనుంది. ఈ సందర్భంగా.. పిలల్ల సామాజిక, మానసిక పరిస్థితిపై ప్రభావాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్​ సిసోడియా. భౌతిక తరగతును ఆన్​లైన్​ తరగతులు ఎప్పటికీ భర్తీ చేయలేవని నొక్కిచెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి:దిల్లీలో ఆంక్షల సడలింపు.. వారాంతపు కర్ఫ్యూ ఎత్తివేత

ABOUT THE AUTHOR

...view details