కొవిడ్ ఆంక్షల నుంచి సడలింపులు ఇవ్వడంతో ఛత్తీస్‌గఢ్‌లో పాఠశాలలు ఏడాది తర్వాత ప్రారంభమయ్యాయి. కొవిడ్ పాజిటివిటీ రేటు గత వారం రోజులుగా ఒక శాతం ఉన్న జిల్లాల్లో మాత్రమే పాఠశాలలను తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. ప్రభుత్వం 50శాతం హాజరు షరతు విధించగా పాఠశాలల యాజమాన్యాలు ఆ మేరకు ఏర్పాట్లు చేశాయి. ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు ఏడాది తర్వాత పది, 12 తరగతుల విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరయ్యారు. పంజాబ్‌లోనూ పాఠశాలలు తెరుచుకున్నాయి. విద్యార్థుల మధ్య భౌతిక దూరం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తల్లిదండ్రుల సమ్మతి మేరకే విద్యార్థులను తరగతులకు అనుమతించారు. పంజాబ్ విద్యార్థులు బడులు తెరవడంపై హర్షం వ్యక్తం చేశారు.
కరోనా మహమ్మారి వల్ల పాఠశాల మూసివేసి ఏడాది అయింది. పాఠశాల తెరవడం చాలా మంచి విషయం. పిల్లలు చదువుకోవచ్చు. పాఠాలు అర్థం చేసుకోవచ్చు. ఆడుకోవచ్చు. పిల్లలందరికీ సంతోషంగా ఉంది.
-మౌనీష్, విద్యార్థి, లూథియానా, పంజాబ్
మా అంగీకారంతోనే పాఠశాలకు వచ్చాం. ఇంటర్నెట్ సమస్య వల్ల ఆన్‌లైన్ క్లాస్‌లు నిలిచిపోయేవి. పూర్తిగా అర్థమయ్యేవి కాదు. ఇక్కడ అర్థంకాకపోతే మేడమ్‌ను అడగవచ్చు. స్కూల్‌తో పోల్చితే ఆన్‌లైన్ చాలా ఇబ్బందిగా ఉంటోంది. శానిటైజర్ వెంట తెచ్చుకుంటున్నాం. భౌతికదూరం పాటిస్తున్నాం. మాస్క్ వేసుకుంటున్నాం. వ్యాక్సిన్ వస్తే వేయించుకుంటాం.
-మన్షీరా కౌర్, విద్యార్థిని, అమృత్‌సర్- పంజాబ్
ఉత్తరాఖండ్‌లోనూ 9 నుంచి 12 తరగతి వరకు పాఠశాలలను తెరిచారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ బడుల్లో శానిటైజేషన్ సహా అన్ని ఏర్పాట్లు చేశారు. నేరుగా అయితే పాఠాలు అర్థం చేసుకోవచ్చని, బాగా చదువుకోవచ్చని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఇన్ని రోజుల తర్వాత పాఠశాలకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ మా కాన్సెప్ట్‌లు అర్థం చేసుకోవచ్చు. పాఠశాల తెరవడం చాలా మంచి విషయం. స్కూల్‌కు వెళ్లేందుకు మా తల్లిదండ్రులు కూడా అంగీకరించారు. మేము కూడా వచ్చేందుకు సమ్మతించాం. ముందు చాలా భయం ఉండేది. ఇప్పుడూ కూడా కొంత భయం ఉంది.