తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కర్ణాటక, కేరళలో స్కూళ్లు పున:ప్రారంభం - Schools reopen news updates

కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు దశలువారీగా తెరుచుకుంటున్నాయి. కఠినమైన కొవిడ్ నిబంధనలు అమలు చేస్తూ.. కేరళ, కర్ణాటక సహా పలు రాష్ట్ర సర్కారులు.. బడులు తెరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని ఓ టైలర్ 6000మంది విద్యార్థులకు ఉచితంగా మాస్కులు పంపిణీ చేశాడు.

Schools reopen in Kerala and Karnataka
కరోనా నిబంధనలతో తెరుచుకున్న బడులు

By

Published : Jan 1, 2021, 4:59 PM IST

కరోనా వ్యాప్తి వల్ల గతేడాది మార్చిలో మూతపడిన పాఠశాలలు.. కేరళ, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో శుక్రవారం(జనవరి 1) నుంచి పాక్షికంగా తెరుచుకున్నాయి. విద్యార్థుల మధ్య రెండు మీటర్ల దూరం పాటిస్తూ తరగతులు ప్రారంభమయ్యాయి. షిఫ్టులవారీగా పరిమిత గంటల్లో తరగతులను నిర్వహిస్తున్నారు.

తరగతులకు హాజరైన విద్యార్థులు
మాస్కులు ధరించిన సిబ్బంది, విద్యార్థులు

కొవిడ్‌ నిబంధనలను కఠినంగా పాటిస్తూ తరగతులు నిర్వహించాలని ఇటీవల మార్గదర్శకాల విడుదల చేసింది కేరళ సర్కారు. పరిమిత గంటల పాటు 10, 12 తరగతులకు ఇవాళ క్లాసులు ప్రారంభమ‌య్యాయి. ఒకసారికి 50శాతం మంది విద్యార్థులను మాత్రమే అనుమతించాలని పాఠశాల యాజమాన్యాలకు కేరళ సర్కారు సూచించింది. విద్యార్థులు మాస్కులు ధరించేలా చూడాలని, శానిటైజర్లు అందుబాటులో ఉంచాలని తెలిపింది. తల్లిదండ్రుల అనుమతితో మాత్రమే విద్యార్థులను అనుమతించాలని పేర్కొంది.

భౌతికదూరం పాటిస్తూ కుర్చున్న విద్యార్థులు
విద్యార్థులకు శానిటైజ్​ చేస్తున్న సిబ్బంది

విద్యార్థులకు ఉచితంగా మాస్కులు​

కర్ణాటకలోనూ 10, 12 తరగతుల విద్యార్థులకు పాఠశాలలను ప్రారంభిస్తున్నట్లు యడియూరప్ప సర్కారు వెల్లడించింది. ఈ నేపథ్యంలో చామరాజనగర జిల్లాకు చెందిన ఓ టైలర్​ 6000 మంది విద్యార్థులకు ఉచితంగా మాస్కులు పంచిపెట్టాడు. వృత్తిపరంగా దర్జీ అయిన వైయూ ఖాన్.. సామాజిక సేవలోనూ చురుగ్గా ఉంటాడు. అంతేకాదు ప్రభుత్వ పాఠశాలల యూనిఫాం కుట్టడానికి రూ.100 డిస్కౌంట్​ ఇస్తాడు. అలాగే ప్రైవేటు స్కూల్​ యూనిఫాం అయితే సాధారణ ధరే పుచ్చుకుంటాడు ఖాన్​. ​

వైయూ ఖాన్​
విద్యార్థుల కోసం తయారు చేసిన మాస్కులు

ఇదీ చూడండి:రికార్డు ధర పలికిన మిర్చి- క్వింటా రూ.55,329

ABOUT THE AUTHOR

...view details