తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీలో తీవ్రస్థాయికి కాలుష్యం​.. స్కూళ్లకు సెలవులు

దిల్లీలో పెరుగుతున్న కాలుష్య తీవ్రత దృష్ట్యా ఆప్​ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ప్రాథమిక పాఠశాలలు మూసివేయనున్నట్లు సీఎం కేజ్రీవాల్​ ప్రకటించారు.

schools closed in delhi due to air pollution
schools closed in delhi due to air pollution

By

Published : Nov 4, 2022, 11:58 AM IST

Updated : Nov 4, 2022, 1:46 PM IST

దిల్లీలో కాలుష్య తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. ఈ క్రమంలో ఆప్​ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. రాజధానిలో కాలుష్య పరిస్థితి మెరుగుపడే వరకు దిల్లీలోని ప్రాథమిక పాఠశాలలను మూసివేస్తున్నట్లు దిల్లీ సీఎం కేజ్రీవాల్​ శుక్రవారం ప్రకటించారు. 5వ తరగతి కంటే పైబడిన విద్యార్థుల బహిరంగ క్రీడా కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు శుక్రవారం పంజాబ్​ సీఎం భగవంత్​ మాన్​తో కలిసి దిల్లీలో ప్రకటించారు. కాలుష్యం కట్టడికి అవసరమైతే మరిన్ని చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. వాహనాలకు సరి-బేసి విధానాన్ని తిరిగి అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలిపారు.

తీవ్ర స్థాయిలో కాలుష్యం..
దిల్లీలోని చాలా ప్రాంతాల్లో వాయు నాణ్యత సూచీ(AQI) 450 కంటే ఎక్కువ నమోదయ్యింది. చలికాలంతో పాటు పొగమంచు కూడా తోడు కావడం వల్ల వాయు కాలుష్యం మరింత ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. వ్యవసాయ వ్యర్థాలపై ప్రత్యేక కమిటీ ఇప్పటికే పలు మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ వ్యర్థాలు తగలబెట్టడం కొనసాగడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.

వాయు కాలుష్యంపై సుప్రీం కోర్టులో పిల్​..
దిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్​ను నవంబర్​ 10న విచారించనున్నట్లు జస్టిస్ యూయూ లలిత్ ధర్మాసనం పేర్కొంది. దిల్లీకి సమీపంలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్థాలను తగలబెట్టడం వల్ల వాయుకాలుష్యం మరింత అధ్వానంగా మారిందంటూ న్యాయవాది శశాంక్‌ శేఖర్‌ ఝా ఈ వ్యాజ్యం వేశారు.

ఇదీ చదవండి:'స్మగ్లింగ్​కు సీఎం అండ.. ఆ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా'.. గవర్నర్​ సవాల్

పోలింగ్ బూత్ మొత్తానికి ఒక్కరే ఓటర్.. ఆయన కోసం 8 మందితో ఈసీ ప్రత్యేక ఏర్పాట్లు

Last Updated : Nov 4, 2022, 1:46 PM IST

ABOUT THE AUTHOR

...view details