మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలోని నగ్దా - ఉన్హేల్ రహదారి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు చిన్నారు మరణించారు. వేగంగా వన్తున్న ఒక లారీ.. స్కూల్ వ్యాన్ను ఢీకొట్టగా అందులో ఉన్న విద్యార్థుల్లో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడ్డ మరో పదకొండు మందిని చికిత్స కోసం ఉజ్జయినికి తరలించారు.
వివరాల్లోకి వెళితే.. ఉజ్జయిని జిల్లాలోని నగ్దా ప్రాంతంలోనున్న ఒక కాన్వెంట్ వ్యాన్ పిల్లలతో సహా స్కూల్కు బయలుదేరింది. మార్గ మధ్యలో తప్పు మార్గంలో వస్తున్న ఒక లారీ వారికి ఎదురుగా వచ్చి వ్యాన్ను ఢీకొట్టింది. స్కూల్ వ్యాన్ నుజ్జు నుజ్జు అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ఆంబులెన్స్ సేవలు సరిగా లేక విద్యార్థులను ఉజ్జయిని వైపు వెళ్తున్న బస్సులో చికిత్స కోసం తరలించారు.
దైవదర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా.
రాజస్థాన్లోని సీకార్ జిల్లాలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. వీరంతా సలాసర్ క్షేత్రాన్ని సందర్శించి తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. మృతులు హరియాణాలోని హిసార్ వాసులని పోలీసులు గుర్తించారు.