సాగుచట్టాలను నిరసిస్తూ హరియాణాలోని రోహ్తక్కు చెందిన ముకేశ్ దాగర్ అనే ఉపాధ్యాయుడు.. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. అంతకుముందు సామాజిక మాధ్యమంలో లైవ్‌లోకి వచ్చి.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తెలిపారని పోలీస్ అధికారులు వివరించారు.
రెండుసార్లు లైవ్‌లోకి..!
ముకేశ్.. ఆత్మహత్యకు ముందు రెండుసార్లు ఫేస్బుక్ లైవ్‌లోకి వచ్చినట్లు డీఎస్పీ గౌర్ఖాపాల్ రాణా తెలిపారు. లైవ్ వీడియోలో తాను పురుగుల మందు తాగుతున్నట్లు చెప్పారని రాణా వివరించారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించామన్నారు.
ఇదీ చదవండి :పోలీసుల క్రూరత్వం- మాస్కు లేదని.. నడిరోడ్డుపై!