తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీనియర్లు, జూనియర్​ మధ్య వాగ్వాదం.. పదో తరగతి విద్యార్థి మృతి

ఒకే పాఠశాలకు చెందిన సీనియర్లు, జానియర్​ మధ్య జరిగిన చిన్నపాటి గొడవ.. ఓ విద్యార్థి మృతికి దారితీసింది. తీవ్రమైన గాయాలతో బాధిత విద్యార్థిని ఆసుపత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు నిర్థరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది.

A tenth-class student was beaten to death by fellow students.
A tenth-class student was beaten to death by fellow students.

By

Published : Jul 11, 2022, 6:40 PM IST

సీనియర్లు, జూనియర్ల మధ్య గొడవలు కామన్​. కాసేపటికే వారు మళ్లీ కలిసిపోతుంటారు. కానీ, ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​లో చిన్నపాటి గొడవగా మొదలై తీవ్ర వాగ్వాదంగా మారింది. ఈ ఘటనలో పదో తరగతి విద్యార్థి తీవ్ర గాయాలతో మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బాధితుడ్నిమోహన్ సింగ్​ రాజ్​పుత్​గా గుర్తించారు.

అసలేం జరిగిందంటే?.. రాయ్​పుర్​లోని ఖమత్​రాయ్​లో శివాజీనగర్​ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాధితుడు మోహన్​ సింగ్​ రాజ్​పుత్​.. స్నేహితులతో కలిసి గణిత పరీక్ష రాయడానికి వెళ్లాడు. పరీక్ష ముగిశాక బయటకు వస్తున్న సమయంలో మోహన్​కు అతడి సీనియర్లకు చిన్న విషయంలో వాగ్వాదం జరిగింది. దీంతో కోపం పెంచుకున్న సీనియర్లు.. మోహన్​ను చితకబాదారు. వెంటనే అతడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అక్కడే ఉన్న మిగతా విద్యార్థులు.. అంబులెన్స్​లో మోహన్​ను మెకహరా ఆసుపత్రికి తరలించినా.. లాభం లేకుండా పోయింది. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు నిర్థరించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. మెకహరా ఆసుపత్రికి వెళ్లారు. కేసు నమోదు చేసుకుని.. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఓ మైనర్ విద్యార్థిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న మిగిలిన విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details