తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆరో తరగతి విద్యార్థినిపై గ్యాంగ్ రేప్​.. స్కూల్​లోనే హెడ్​మాస్టర్​తో కలిసి మరో టీచర్ దారుణం - మైనర్​పై హత్యాచారం

School Student Gang Rape Odisha : స్కూల్​ టాయిలెట్​లో ఆరో తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు ఉపాధ్యాయులు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది.

school student gang rape odisha
school student gang rape odisha

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 3:30 PM IST

Updated : Nov 10, 2023, 4:21 PM IST

School Student Gang Rape Odisha :స్కూల్​ టాయిలెట్​లో 11 ఏళ్ల విద్యార్థినిపై ఇద్దరు ఉపాధ్యాయులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఒడిశాలోని నబరంగ్​పుర్​ జిల్లాలో జరిగింది. విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే..
కుందేయ్​ ప్రాంతంలోని ఓ పాఠశాలలో బాధితురాలు.. ఆరో తరగతి చదువుతోంది. ఆమె టాయిలెట్​లోకి వెళ్లిన సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, మరో టీచర్​తో కలిసి బలవంతంగా బాత్​రూమ్​లోకి ప్రవేశించాడు. అనంతరం ఇద్దరూ కలిసి బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. కాసేపటికి బాధితురాలు ఇంటికి వెళ్లిపోయింది.

నవంబరు 9న బాధితురాలి పొత్తి కడుపులో నొప్పిగా ఉండడం వల్ల తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే వారు ప్రాథమిక చికిత్స అందించారు. అప్పటికీ నొప్పి తగ్గకపోవడం వల్ల నబరంగ్​పుర్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు బాధితురాలిపై లైంగిక దాడి జరిగిందని తేల్చారు. ఈ క్రమంలో బాధితురాలి తల్లిదండ్రులు కుందేయ్​ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలు ప్రస్తుతం నబరంగ్​పుర్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. నవంబరు 7న గిరిజన విద్యార్థినిపై అత్యాచారం జరగగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని అన్నారు.

మైనర్​పై గ్యాంగ్​రేప్​..
17 ఏళ్ల మైనర్​పై ముగ్గురు వ్యక్తులు కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దారుణాన్ని వీడియో తీసి.. బాలికను బెదిరించారు. కర్ణాటకలోని మండ్యలో నవంబర్ 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో ఇద్దరు నిందితులు.. బాధితురాలి క్లాస్​మేట్సేనని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నిందితుల్లో ఒకరితో బాధితురాలికి పరిచయం ఉంది. అతడు.. మైనర్​ను మద్దూర్​లోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడికి అతడి మరో ఇద్దరు స్నేహితులను పిలిచాడు. అనంతరం వారు ముగ్గురు కలిసి మైనర్​పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం నిందితుల్లో ఒకడు అత్యాచార వీడియోను ఫోన్​లో రికార్డ్ చేశాడు. ఆ వీడియోను బాధితురాలికి పంపించి.. బ్లాక్ మెయిల్ చేశారు. ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడికి లోనైన బాధితురాలు.. జరిగిన విషయమంతా తల్లిదండ్రులకు చెప్పింది. వారు తమ కుమార్తెపై గ్యాంగ్​రేప్ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అత్యాచార సమయంలో నిందితులు మద్యం మత్తులో ఉన్నారని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అంతేకాకుండా నిందితుల్లో ఇద్దరు మైనర్​లని పోలీసులు తెలిపారు.

ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం..
బిహార్​లోని సీతామడిలో ఐదేళ్ల చిన్నారిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారిని హత్య చేశాడు. బుధవారం సాయంత్రం జరిగింది ఈ హత్యాచారం. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయగా.. వారి ఎదుట నేరాన్ని అంగీకరించాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
బుధవారం సాయంత్రం నుంచి బాలిక కనిపించలేదు. కంగారుపడిన ఆమె కుటుంబ సభ్యులు వెతకటం ప్రారంభించారు. ఎంతకీ చిన్నారి ఆచూకీ లభించకపోవడం వల్ల పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు డాగ్ స్క్వాడ్​ సహాయంతో బాధితురాలి మృతదేహాన్ని గుర్తించారు. అనంతరం ఓ యువకుడిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

'నిందితుడు రెండు రోజుల క్రితమే చిన్నారి ఇంటికి వచ్చాడు. బుధవారం సాయంత్రం బాలికకు బిస్కెట్లు ఇచ్చాడు. అనంతరం ఆమెను మభ్యపెట్టి చెరకు తోటలోకి తీసుకెళ్లి.. అత్యాచారం చేశాడు. ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేశాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశాం. నిందితుడు.. బాలికకు వరుసకు చిన్నాన్న అవుతాడు' అని డీఎస్​పీ రామకృష్ణ తెలిపారు.

4ఏళ్ల చిన్నారిపై హత్యాచారం! చాక్లెట్లు ఇచ్చి రేప్ చేసి, దారుణంగా చంపిన పొరిగింటి యువకుడు

Girl Gangrape By 7People : 15ఏళ్ల బాలికపై ఏడుగురు గ్యాంగ్​రేప్​.. ఆ ఫొటోలు చూపిస్తూ.. బెదిరించి మరీ..

Last Updated : Nov 10, 2023, 4:21 PM IST

ABOUT THE AUTHOR

...view details