ఐదో తరగతి చదువుతోన్న చిన్నారిపై అత్యాచారం చేసి, ఆమె గర్భం దాల్చడానికి కారణమైన పాఠశాల ప్రిన్సిపల్‌కు బిహార్ పోక్సో కోర్టు మరణ శిక్ష విధించింది. మరో ఉపాధ్యాయునికి జీవితకాల శిక్ష విధించింది.
ఐదో తరగతి చదువుతోన్న 11ఏళ్ల చిన్నారిపై పట్నాలోని ఓ పాఠశాల ప్రిన్సిపల్ అరవింద్ కుమార్, అభిషేక్ కుమార్ అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే బాలికకు ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆమె గర్భవతని వైద్యులు చెప్పారు. 2018 సెప్టెంబర్‌లో వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.